👉

🔸కష్టకాలం లో పార్టీకి అండగాఉంటా!

🔸 రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్

🔸 ఖమ్మం లో బీ.ఆర్.యస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం

🔸 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.

🔸 తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు

🔸 ఆరు గ్యారెంటీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

🔸 రైతులకు 25వేల నష్టపరిహారం తో పాటుగా వరి పంటకు రూ. 500 బోనస్
ఇవ్వాలి.

🔸 ప్రజలను, రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ కు తగిన గుణపాఠం నేర్పాలి

🔸పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం..

👉 జూలూరుపాడు మండల బీ.ఆర్.యస్ పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సన్నాహక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు

➖పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎంఎల్సీ తాతా మధుసూదన్

🔸🔸జూలూరుపాడు, 07ఏప్రిల్ : – కష్టకాలం లో పార్టీకి అండగా నిలబడతానని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. రానున్న రోజుల్లో బీ.ఆర్.యస్ పార్టీదే భవిష్యత్ అన్నారు. ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రం లో పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన ఎన్నికల సన్నాహాక సమావేశం లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్సీ , జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ తో కలసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీ.ఆర్.యస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. శాసనసభ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని రైతులు, ప్రజల నుండి వినిపిస్తుందని, తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సాగునీరు, తాగునీరు లేక రైతాంగం తో పాటుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఎకరాకు 25 వేలు పంట నష్టపరిహారం తో పాటుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరి పంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించిన తీరును వివరించాలని కోరారు, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి విప్లవాత్మక పథకాలు దేశం లోనే ఎక్కడ లేవని, అలాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రం లో అమలు చేసి రైతుకు పెట్టుబడి సహాయం, పుష్కలంగా సాగునీరు, ఉచిత విద్యుత్, పంట కొనుగోలు చేసి రైతు కుటుంబాలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. తను ఎంపీ గా గెలవకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఒక్క నేషనల్ హైవే కూడా ఉండేది కాదని తరువాత కేంద్రం పై పోరాడి పలు రోడ్లను నేషనల్ హైవే లాగా మార్చడం తో పాటుగా వందల కోట్ల నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చి ఎన్నో గ్రామాల మధ్య లింక్ రోడ్లను బీటీ రోడ్లగా మార్చమని గుర్తు చేశారు. అలానే రైల్వే పనులు కూడా పూర్తి చేసుకున్నమన్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశం లో నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, జడ్పీటీసీ కళావతి , నాయకులు యల్లంకి సత్యనారాయణ , చావా వెంకటరామరావు , పొలదాసు కృష్ణమూర్తి , లకావత్ గిరిబాబు, దుద్దుకూరి నాగేశ్వరరావు , కృష్ణప్రసాద్ ,రామ్మూర్తి , మోదుగు రామకృష్ణ , రెడ్డిబోయిన రాము సహ పలువురు ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed