ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్… తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం… వేరే పేర్లు సూచించాలని కోరిన ఏఐసీసీ అయోమయంలో మంత్రులు… కీంకర్త్యం అనే ఆలోచనతో మల్లగుల్లాలు మంత్రులతో విడి వీడిగా రాహుల్ తో పాటు అంతరంగికుల చర్చలు మళ్ళీ ఆశావహులు రంగంలోకి… వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) కు అవకాశం ఉగాది తర్వాత పేరు ప్రకటిస్తారని ప్రచారం. ఖమ్మం పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. జిల్లాలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తమ కుటుంబసభ్యులకే టికెట్ ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉండటంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఎవరి కుటుంబసభ్యులను ఎంపిక చేసిన మరొకరికి కోపం వస్తుందనే ఉద్దేశంతో ఖమ్మం లోకసభకు కుటుంబసభ్యులకు నో టికెట్ అనే విషయాన్నీ స్పష్టం చేసినట్లు అంత్యంత విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన మంత్రులనే వేరే పేర్లు సూచించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో మంత్రులు అయోమయంలో పడ్డారు. అతి సులువుగా గెలిచే సీటు అయినందున తమ వారికీ టికెట్ ఇస్తే బాగుంటుందని తమ శక్తిని అంతా ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయంతో మదనపడుతున్నారు. ఫలితంగా కీంకర్త్యం అనే ఆలోచనలో మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం జనజాతర సభకు వచ్చిన రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ కు జిల్లాకు చెందిన నేతలను పిలిచి టికెట్ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే చివర ప్రయత్నంగా వారు రాహుల్ సన్నిహితులవద్ద తమ అభిప్రాయాలను తెలిపి తమ వారికే టికెట్ ఇవ్వాలని కోరారని అందుకు అదిసాధ్యం కాకపోవచ్చునని వేరే పేర్లు ఉంటె సూచించాలని వారికీ నిష్కర్షగానే చెప్పినట్లు తెలుస్తుంది. కొత్త వారిలో ఖమ్మం జిల్లా వాసి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు, ప్రముఖ వ్యాపారవేత్త… వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) కి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు