మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు

ఖమ్మం: రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్న సందర్భంగా ఉభయ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు ఎంతో నిష్ఠ తో ఉపవాసాలు(రోజా) ఉండి.. ఆకలిదప్పుల విలువ తెలుసుకొని.. పవిత్రంగా జరుపుకునే ఈద్ ఇదని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలనే దృఢ సంకల్పంతో..పిల్లలు, యువతకు దిశా నిర్దేశం చేసిన మాసం ఇదని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త (స) ఆదేశానుసారం.. అనాది నుంచి నేటి వరకు ఫిత్రా పేరిట ఆహారం, వస్త్రాలు, నగదు రూపంలో పేదలకు సాయం చేస్తూ వస్తోన్న సంప్రదాయం ఎంతో గొప్పదని మంత్రి పొంగులేటి అభివర్ణించారు. అంతటా ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనల నడుమ రంజాన్ పండుగను సంబరంగా జరుపుకోవాలని, ఈద్ ముబారక్ ఆత్మీయ శుభాకాంక్షలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు