


టి జి ఓ భవన్లో టీజీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు TGO ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీ మోదుగు వేలాద్రి గారి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ …మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఉద్యోగుల సమస్యలపై తీసుకున్న కార్యాచరణ కొంత వేగం తగ్గింది. తప్ప సమస్యలపై తమ ప్రాతినిధ్యం నిరంతరం కొనసాగుతుంది అని తెలియజేశారు
.
ఉద్యోగుల సమస్యలపై నిన్నటిదాకా నాయకులు గా చలామణి అయిన వారు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుని ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసి నేడు మాట్లాడుతుండటం సిగ్గుచేటు అని తెలిపారు. బకాయిపడిన డిఏలు 1 -7- 2022 నాటికి 6,40,000 మంది ఉద్యోగులకు 2500 కోట్లు రెండవ డి ఏ 01-01-2023 నాటికి 1800 వందల కోట్లు 1 -7 -2023 నాటికి 1100 కోట్లు మొత్తం 5400 కోట్లు ఉద్యోగులకు అందాలని ….నాలుగవ డిఏ పిఆర్సి లో కలుస్తుంది.. కాబట్టి వీటన్నింటినీ దశలవారీగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సాధించుకుంటామని తెలిపారు..
ముఖ్యంగా నగదుతో సంబంధంలేని సమస్యలు చాలా ఉన్నాయి. మొదటిది 317 జీవో అందులో భార్యాభర్తలు తల ఒకచోట పనిచేస్తూ ఉన్నారు.. కనీస మానవత్వం లేకుండా 317 జీవోతో ప్రభావితం అయిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించకుండా ఎక్కడో సంగారెడ్డి వారిని భద్రాచలంలో… సత్తుపల్లిలో అత్యంత దూరంగా పోస్టింగ్లు ఇవ్వడం తో వారి మనోవేదన అరణ్య రోదన అయింది..
ఈ విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సమస్యలు అన్నీ కూడా వివరించడం జరిగింది..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ నుండి 10 సంవత్సరాల తర్వాత నాలుగో తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చిన ఘనత ప్రస్తుత టీజీవో నాయకత్వానికి చెందుతుంది..
కాబట్టి ఉద్యోగులను అవమానించడం అనేది గత పది సంవత్సరాలుగా చూసాము ఆ పరిస్థితులు మారడం కోసం ఉద్యోగుల ఆత్మ గౌరవం కాపాడటం కోసం ప్రస్తుత ఉద్యోగ సంఘాల నాయకత్వం పనిచేస్తుంది. అని తెలిపారు.. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 142 జీవోను పున సమీక్షించాలి అని మధ్యంతర భృతిని ఐదు శాతం నుండి 20 శాతం వరకు పెంచాలి అని… ఎన్నికల కోడ్ ముగియగానే సాధారణ బదిలీలను కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని …జిల్లాస్థాయి డివిజన్ స్థాయి…. మండల స్థాయి అధికారుల పట్ల అవమానకరంగా అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంతమంది జిల్లా కలెక్టర్ల పైన తగు చర్యలు తీసుకోవాలి అని ..
20 24 మార్చి 31వ తేదీ లోపు పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు రీ షెడ్యూల్ చేయాలి అని.. TGO రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు అన్నారు…
ఈ కార్యక్రమంలో టిజిఓ మహిళా నాయకురాలు సుధారాణి విజయలక్ష్మి డిపి గణేష్ సతీష్ మోదుగు వెంకటేశ్వర్లు పి వీరస్వామి ఎన్.వి.కృష్ణారావు పుష్ప రాజ్ వి రమేష్ సంజీవరెడ్డి నాగేశ్వరరావు రమణ మరియు టీఎన్జీవో నాయకులు కొణిదల శ్రీనివాసరావు గుంటుపల్లి శ్రీనివాసరావు గంగవరపు బాలకృష్ణ జైపాల్ దుర్గాప్రసాద్ తాళ్లూరు శ్రీకాంత్ వెంకట్రావు రాజకుమార్ భీముడు తేజావత్ శ్రీనివాస్ విజయ్ గోపయ్య డ్రైవర్ల సంఘం నుండి ఎండి హకీమ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నుండి దిక్కు నాయక్ అస్మత్ బేగ్ తదితరులు పాల్గొన్నారు..
ఇట్లు
మోదుగు వేలాద్రి
TGO secretary. khammam.
