

తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గజ్జెల్లి వెంకన్న గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీ దేవరకొండ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్
నందు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
గౌ. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని
మరియు
హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెస్ ఆఫీస్ గాంధీభవన్ నందు
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు
గౌ. శ్రీ పొన్నం ప్రభాకర్
గారిని మర్యాదపూర్వకంగా కలిసి
- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ
- రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని
- నాయి బ్రాహ్మణ కులస్తులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని
మరియు పలు రకాల డిమాండ్స్ తో వీరిద్దరిని కలవడం జరిగింది.
దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎన్నికల కోడ్ వల్ల ప్రకటించలేదని ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెంటనే ప్రకటిస్తాం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అలాగే పలు రకాల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రభుత్వ సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడం జరిగింది….
ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ మరియు నాయి బ్రాహ్మణ ముఖ్య నాయకులు నేతలు పాల్గొనడం జరిగింది..
మీ
గజ్జెల్లి వెంకన్న
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం
రాష్ట్ర అధ్యక్షులు…..
