




బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ నేడు
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జీ ర్యాలీని
జయప్రదం చేయండి: బీజేపీ నేతల పిలుపు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ ను పురస్కరించుకుని శుక్రవారం నాడు (ఏప్రిల్ 19న) ఖమ్మం పట్టణానికి వస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ర్యాలీకి అధిక సంఖ్య లో హాజరై జయప్రదం చేయాలని పార్టీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోడీ జీని మూడో సారి ప్రధానిగా చేయాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రజల ఆకాంక్షకు తగినట్లు ర్యాలీ కోసం భారీ ఏర్పాటుచేసినట్టు పార్టీ అభ్యర్థి వినోద్ రావు ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఉదయం నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, సాయంత్రం 2.30 నుంచి జరిగే ర్యాలీలో పాల్గొందుకు రాజ్ నాథ్ ప్రత్యేక ఛాపర్ లో ఖమ్మం వస్తున్నారని తెలిపారు. సర్దార్ పటేల్ స్టేడియం దగ్గర ప్రారంభమయ్యే ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్, జడ్ పీ సెంటర్, మయూరి సెంటర్ మీదుగా పెవిలియన్ గ్రౌండ్ కు చేరుకుంటుందని చెప్పారు. ఇందుకోసం రెండు వేల మందితో కళాబృందాలు పాల్గొంటాయని చెప్పారు. జడ్ పీ సెంటర్, మయూరి సెంటర్ లలో రాజ్ నాథ్ సింగ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.
రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల బీజేపీ కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్చార్ మార్తినేని ధర్మారావు, పార్లమెంట్ ప్రభారీ శ్రీకాంత్, కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారు, భద్రాద్రి-కొత్తగూడెం అధ్యక్షులు రంగా కిరణ్ గారు తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిన్నటి వరకూ తన పర్యటనలు పూర్తయ్యాయని, ప్రజలు బీజేపీకి విస్పష్టంగా నీరాజనం పలుకుతున్నారని వినోద్ రావు చెప్పారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారు మాత్రమే అధినేతగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆయన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెరిగిన దేశ ప్రతిష్ట, అయిదు వందల సంవత్సరాలనుండి పరిష్కారం కానీ అయోధ్య రామమందిరం నిర్మాణం, ఇతర అన్ని విషయాలను ప్రజలందరూ పరిగణనలోకి తీసుకుని ఒక నిచ్చితాభిప్రాయానికి వచ్చారని అయన తెలిపారు. దేశం రామ రాజ్యంగా ఉండాలన్న , అభివృద్ధిలో ఇంకా ముందుకు సాగాలన్న రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి సారధ్యంలోని బీజేపీ కి ఓటు వేయాలని ఖమ్మం ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.
ఈ సారి ఖమ్మంలో కమల వికాసం ఖాయమని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ చెప్పారు. విద్యావంతుడు, స్వచ్ఛమైన చరిత్ర గలిగిన వినోద్ రావు గారి ప్రజాదరణ రోజురోజుకూ పెరిగిందని అన్నారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ- కాంగ్రెస్ కు ఓటువేస్తే వృధా అవుతుందని చెప్పారు. పదేళ్ల పాలనలో బీ ఆర్ ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే, ఇచ్చిన హామీలు తప్పి ప్రజలను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందని అయన అన్నారు.
పట్టణ నాలుగో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నె ఉదయ్ ప్రతాప్, వీరెల్లి లక్ష్మయ్య, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, శ్యామ్ రాథోడ్, చావా కిరణ్, బోళ్ల బిక్షపతి పాల్గొన్నారు.
