





ఖమ్మం ప్రతినిధి బిఎన్బి న్యూస్ మే 17
ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డినే గెలిపిద్దాం..
అధికార పార్టీకి వత్తాసు పలికే తీన్మార్ మల్లన్నతో ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి వినిపించదు.
పూటకో రంగు మార్చే తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పాలి..
సామాజిక సేవ గుణం ఉండి రాజకీయాలకు వచ్చి, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని మంచి వ్యక్తి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు బలపరిచిన ఏనుగుల రాకేష్ రెడ్డికి మాత్రమే చట్టసభల్లో కూర్చునే అర్హత ఉంది.
ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత మరియు విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించి హక్కుల కోసం పోరాడే ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించేందుకు నిర్ణయం తీసుకోవాలి..
మీలో ఒక్కడిగా మీ అందరి ప్రతినిధిగా మీ గలాన్ని ప్రశ్నించడానికి శాసనమండలిలో మీ హక్కుల కోసం కొట్లాడే అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లోని సీరియల్ నెంబర్ :03పై మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించి శాసనమండలి వేదికగా ఉద్యోగుల, నిరుద్యోగుల, యువత, విద్యావంతుల గొంతును వినిపించాలని MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ నందు నల్గొండ ఖమ్మం – వరంగల్ – పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఓటర్లను కోరారు.
MLC, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు మాట్లాడుతూ:
👉 కేసీఆర్ ఆశీస్సులు, కేటీఆర్ ప్రోత్సహంతో రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు.
👉 ఎమ్మెల్సీ ఎన్నికలలో నియోజకవర్గం స్వమన్య కార్యలను నియమించాం..
👉 రాకేష్ రెడ్డి మంచి విద్యావంతులు.. అమెరికాలో పని చేస్తూ దేశం కోసం సేవా చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు.
👉 కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.
👉మంచి వ్యక్తి, విద్యావతుండు ఐనా రాకెష్ రెడ్డి నీ కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
👉 ఈ నియెజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు సార్లు గెలుపొందారు. తెలంగాణ సమాజానికి పట్టిన చిడాపురుగుల్లో ఒక పురుగు,బ్లాక్ మెయిలర్ మలన్న పోటీ చేస్తున్నాడు..
👉 అటువంటి వ్యక్తి నీ ఎన్నుకోకుండా చైతన్య వంతమైన ఖమ్మం జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ ను కోరుతున్న.. మంచి వ్యక్తి, విద్యావతుండు ఐనా రాకెష్ రెడ్డి నీ వరంగల్, నల్లగొండ, ఖమ్మం విద్యావంతులు గెలిపించాలాని కోరుతున్నాను.
వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ:
👉పట్టభద్రులు ఎన్నిక అనేది చాలా ముఖ్యం.. చదువుకున్న వాళ్ళు,మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారు.
👉 రెండు సార్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చిన ప్రజలు…మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలి అంటే ప్రశ్నించే వ్యక్తి నీ చట్ట సభల్లో ఉండాలి..
👉 ప్రభుత్వాని ప్రశ్నించే వ్యక్తి కలవాల…. ప్రశ్నించలేని వ్యక్తి కావాలా..?
👉 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అంటున్నారు.. మల్లన్న ఏ విదంగా ప్రభుత్వాని ప్రశ్నినిస్తాడు..!
👉 ఇప్పటిదాక నిరుద్యోగ భృతి విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ.. జాబ్ క్యాలెండర్ పై ఎందుకు ప్రశ్నించలేదు.
👉 నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్ అమలు కావాలి అంటే నాకు అవకాశం ఇవ్వండి..
👉 కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో గెలుస్తా.. బీఆర్ఎస్ అభ్యర్ధిగా నేను ప్రశ్నించే గొంతును. మా ప్రశ్న ప్రజలకోసం…ప్రజా సమస్యల కోసం..
👉 దందా కోసం,డబ్బు కోసం, వ్యూస్ కోసం కాదు. 5వ సారి గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేస్తాం..
👉 పెద్దలు పట్ట భద్రులు ఈనెల 27 న జరిగే ఎన్నికలో
3 నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు & ఖమ్మం నియోజవర్గం పట్టభద్రుల ఎన్నికల ఇన్చార్జ్ ఆర్.జె.సి కృష్ణ, మధిర నియోజవర్గ పట్టబద్రుల ఎన్నికల ఇన్చార్జ్ బిచ్చల తిరుమల్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు పగల నాగరాజు, కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, సుబ్బారావు, నరేందర్, ముత్యాల వెంకట అప్పారావు, సతీష్, ఆసిఫ్ హైమద్ సయ్యద్, బురఖాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
