యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కు అరుదైన చికిత్స

  • క్యాన్సర్ స్పెషలిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్
    ఖమ్మం, జూన్ 5: హైదరాబాద్ హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ కు అరుదైన చికిత్స చేసినట్లు ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ పేర్కొన్నారు. ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది బాబుకు చేసిన అరుదైన చికిత్స గురించి వివరించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన షేక్ అబ్దుల్ ఇషాక్ అనే ఏడాది బాబుకి కడుపు నొప్పి, బరువు పెరగకపోవడం, విరేచనం కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు పలు
    హాస్పిటళ్లకు తిరిగి చివరకు తమ వద్దకు వచ్చారన్నారు. బాబుకు పరీక్షలు నిర్వహించగా కడుపులో 2.5 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనితో బయాప్సి చేయగా క్యాన్సర్ అని తేలిందిన్నారు. కాంప్ర హెన్సివ్ క్యాన్సర్ కేర్ విత్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమో థెరపీ చేసి కణితి ని కరిగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో బ్లాడర్ వాల్ తో కణితి ని రిమూవ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా యూరిన్, మోషన్ కెళ్లే నరాలను ప్రిజర్వ్ చేసి సర్జరీ చేయడంతో రోగి కొలుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో నే డిస్సార్జి చేశామన్నారు. ఇప్పుడు బాబు నార్మల్ గానే యూరిన్ కెళ్తున్నాడని ,ఇబ్బంది లేదని తెలిపారు. ఎటువంటి
    క్యాన్సర్ కైనా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ముందుగా నే క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ వైద్యం ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. ఉన్నతమైన వైద్యం ఇప్పుడు తమ హాస్పిటల్ లో అందుతోందన్నారు. ఈ సమావేశంలో రోగి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు