ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున సంబరాలు – విఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున బాణాసంచా టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారి చిత్రపటాలకు పాలాభిశేఖం చేసారు.. దేశంలోనే అతిపెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం కు దక్కిందని వక్తలు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్, , నగర కార్పొరేటర్లు కమర్తపు మురళీ,మలిదు జగన్, కొప్పెర ఉపేందర్,ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి తల్లాడ రమేష్ దిగుమతి శాఖ అధ్యక్షులు దిరిశాల వెంకటేశ్వర్లు, ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్, నగర ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ , బొమ్మా ఉదయ్, వెన్నా శ్రీ్ధర్ బాబు,భాదే రవి, బుర్లె లక్ష్మి నారాయణ ,జహీర్, సాదే శంకర్ బోజెడ్ల సత్య నారాయణ, మరాఠీ యాదయ్య,ఎమ్మే సత్యనారాయణ, మంగ రవి,తుపాకుల మధు మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ByVNB News

Jul 19, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed