ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు జులై 30
ఈ రోజు ఖమ్మం జిల్లా TNGO కార్యాలయం లో
తెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినది. ఈ ఎన్నికల అధికారిగా టి.ఎన్.జి.ఓస్ ఖమ్మం జిల్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ, శ్రీ పెద్దినేని రాధాకృష్ణ గారు వ్యవహరించారు. ఈ ఫోరం అధ్యక్షులుగా శ్రీ డి.రాజకుమార్, కార్యదర్శిగా J. భరత్ రెడ్డి, కోశాధికారి గా CH. లెనిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇరిగేషన్ శాఖ కి సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు 317 సరిగా అమలు కాకపోవడం, స్థానికం గా పదోన్నతులలో అన్యాయం జరగడం వంటి సమస్యలు ఈ ఎన్నిక సందర్భంగా సభ్యులు ప్రస్తావించారు.
నూతనం గా ఎన్నుకున్న కార్యవర్గాన్ని ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు మరియు శ్రీ కొణిదెన శ్రీనివాస్ లు అభినందించారు .
ఈ నాటి ఎన్నిక లో
కార్యవర్గ సభ్యులుగా ch నాగేశ్వర రావు,భీముడు,రవితేజ,గోవిందు,హరిప్రసాద్,శ్రీనివాసులు,కృష్ణ కుమారి,బీబ్సాహెబ్,రాము, శ్రీనివాస్ రావు,రామకృష్ణ,వాసు,అబ్దుల్,యాకూబ్,మదార్ లు ఎన్నికయ్యారు


