సంతాన సాఫల్య కేంద్రాల రిజిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర కమీషనర్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి.
రాష్ట్ర అధికారులు పకడ్బందీ పర్యవేక్షణలు చేస్తున్నారు. వారితో పాటుగా మేము, మా ప్రోగ్రాం అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నాము.
సంతాన సాఫల్య కేంద్రాలు
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021, మరియు సర్రోగసీ (రెగ్యులేషన్) చట్టం, 2021, ప్రకారం చట్ట నియమాలు, నిబంధనలు పాటించాలి.

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు జూలై 30


సంతాన సాఫల్య కేంద్రాలు (ART క్లినిక్‌లు, సరోగసీ సెంటర్లు ) సంతానం కోసం వచ్చిన దంపతుల ( కొన్ని సమయాలలో ఒంటరి మహిళల, ఎల్.బి.టి.క్యూ (లెస్బియన్లు, గే, బై సెక్సువవల్, ట్రాన్స్ జెం డర్ ల )ఆరోగ్యం, నైతిక విషయాలను గుప్తంగా ఉంచాలి. చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తూ దంపతుల వివరాలను పూర్తిగా కాన్ఫీడెన్షియల్ గా ఉంచాలి. వారి ఆరోగ్య విషయాలు, రక్షణ, వైద్యపర వివరాలను
దుర్వినియోగం చేసినట్లయితే చట్టాన్ని పర్యవేక్షించే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి బోర్డులు మరియు రిజిస్ట్రీలు
కఠిన చర్యలు తీసుకుంటాయి.
సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ముందు అక్కడ వున్న డాక్టర్ల నైపుణ్యం, వారి ద్వారా లభించిన విజయాల శాతం కూడా పరిగనణలోకి
తీసుకోవాలి. దంపతులు అలా వెళ్లే ముందు ఇందుకుగాను వున్న చట్టాలు, రూల్స్, నిబంధనలు కూడా తెలుసుకొని వెళ్లాలి. చట్టానికి వ్యతిరేకంగా కానీ , నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా విధానాలు అక్కడ ఉన్నట్లయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము.
జిల్లాలో రిజిస్టర్డ్ ART సెంటర్లు(7), సరోగసి సంతాన సాఫల్య కేంద్రాలు (2) పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రతినెల రాష్ట్రానికి, జిల్లా కార్యాలయానికి రిపోర్ట్లను పంపిస్తున్నారు. వాటిని కూడా పరిశీలిస్తున్నాము. అలాగే రాష్ట్ర , జిల్లా అధికారులు అకస్మిక తనిఖీలు చేస్తున్నారు. డా. బి. కళావతి బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు