
సంతాన సాఫల్య కేంద్రాల రిజిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర కమీషనర్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి.
రాష్ట్ర అధికారులు పకడ్బందీ పర్యవేక్షణలు చేస్తున్నారు. వారితో పాటుగా మేము, మా ప్రోగ్రాం అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నాము.
సంతాన సాఫల్య కేంద్రాలు
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021, మరియు సర్రోగసీ (రెగ్యులేషన్) చట్టం, 2021, ప్రకారం చట్ట నియమాలు, నిబంధనలు పాటించాలి.
ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు జూలై 30
సంతాన సాఫల్య కేంద్రాలు (ART క్లినిక్‌లు, సరోగసీ సెంటర్లు ) సంతానం కోసం వచ్చిన దంపతుల ( కొన్ని సమయాలలో ఒంటరి మహిళల, ఎల్.బి.టి.క్యూ (లెస్బియన్లు, గే, బై సెక్సువవల్, ట్రాన్స్ జెం డర్ ల )ఆరోగ్యం, నైతిక విషయాలను గుప్తంగా ఉంచాలి. చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తూ దంపతుల వివరాలను పూర్తిగా కాన్ఫీడెన్షియల్ గా ఉంచాలి. వారి ఆరోగ్య విషయాలు, రక్షణ, వైద్యపర వివరాలను
దుర్వినియోగం చేసినట్లయితే చట్టాన్ని పర్యవేక్షించే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి బోర్డులు మరియు రిజిస్ట్రీలు
కఠిన చర్యలు తీసుకుంటాయి.
సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ముందు అక్కడ వున్న డాక్టర్ల నైపుణ్యం, వారి ద్వారా లభించిన విజయాల శాతం కూడా పరిగనణలోకి
తీసుకోవాలి. దంపతులు అలా వెళ్లే ముందు ఇందుకుగాను వున్న చట్టాలు, రూల్స్, నిబంధనలు కూడా తెలుసుకొని వెళ్లాలి. చట్టానికి వ్యతిరేకంగా కానీ , నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా విధానాలు అక్కడ ఉన్నట్లయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము.
జిల్లాలో రిజిస్టర్డ్ ART సెంటర్లు(7), సరోగసి సంతాన సాఫల్య కేంద్రాలు (2) పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రతినెల రాష్ట్రానికి, జిల్లా కార్యాలయానికి రిపోర్ట్లను పంపిస్తున్నారు. వాటిని కూడా పరిశీలిస్తున్నాము. అలాగే రాష్ట్ర , జిల్లా అధికారులు అకస్మిక తనిఖీలు చేస్తున్నారు. డా. బి. కళావతి బాయి
