జర్నలిస్టులకు సిపిఐ అండగా ఉంటుంది
సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ను సన్మానించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం
ఖమ్మం ఆగస్టు o3 మన జ్యోతి బ్యూరో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు చేసే పోరాటాలకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు.
ఇటీవల ఖమ్మం లో జరిగిన సీపీఐ పార్టీ 23వ మహా సభలో ఖమ్మం జిల్లా కార్యదర్శి గా దండి సురేష్ ను అ పార్టీ ఏకగ్రీవంగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీలోని తన స్వగృహంలో సురేష్ దంపతులను టియూ డబ్ల్యూయుజె (టిజెఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ తరపున దండి సురేష్ దంపతులకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి ఘనంగా సన్మాంచి సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ….
గత నాలుగు దాశబ్దాల కాలంగా నమ్మిన పార్టీ సిద్ధాంతలకు అనుగుణంగా పని చేసిన దండి సురేష్ కు జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.జర్నలిస్టులు,
బడుగు, బలహీన వర్గాల అపరిష్కృత ప్రజాసమస్యలపై పోరాటలకు అండగా నిలవాలని ఆదినారాయణ కోరారు.
ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడుతూ…
నిబద్దతో పని చేసిన తనకు జిల్లా కార్యదర్శి బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించడం గర్వకారణం గా ఉందన్నారు.
ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడేందుకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే టీజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, 6టీవీ స్టాపర్ కలువకొలను హరీష్,, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యాలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ తిరుపతిరావు, జిల్లా నాయకులు సాయి, పాశం వెంకటేశ్వర్లు, మోహన్ వెంపటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

