ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్
పేరల్లి ప్రవీణ్, పగడాల విజయ్ @ చంటిపై పీడి యాక్ట్ కొనసాగింపు: ఖమ్మం టౌన్ ఏసీపీ
*ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 6 *

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొని ప్రజలను భయభ్రంతులకు గురి చేస్తున్న రౌడీ షీటర్ పేరల్లి ప్రవీణ్,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పగడాల విజయ్ @ చంటి పై ప్రివెంటివ్ డిటెక్షన్ ( పి. డి యాక్ట్ ) ను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఖమ్మం టౌన్ ఏసీపీ. రమణమూర్తి తెలిపారు.
నిందుతులు భూకబ్జాలు చేస్తూ… బెదిరింపులు పాల్పడుతూ… డబ్బులు డిమాండ్ వంటి వరుస నేరాలతో ప్రజలను భయభ్రంతులకు గరిచేస్తున్న నేపథ్యంలో శాశ్వతంగా చెక్ పెట్టడానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఈ ఏడాది మే నెల 26 న ఖమ్మం టూ టౌన్ లో పి.డి యాక్ట్ అమలు చేయగా జులై 30
పగడాల విజయ్ @ చంటి పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో
పి.డి యాక్ట్ అమలు
హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా పీ డీ యాక్ట్ ను అడ్వైజర్ కమిటీ పరిశీలించి ప్రభుత్వనికి సిఫార్సు చేయడంతో ప్రభుత్వం. ఆమోదిస్తూ గతంలో ఉన్న పీడీ యాక్ట్ ను 12 నెలలపాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు..
నిందితుడు గతంలో ఓ హత్య కేసుతో పాటు దోపిడీ, దౌర్జన్యలు, హత్యాయత్నం వంటి మూడు కేసుల్లో నేరాలు రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ….
సత్ప్రవర్తనతో జైలు నుండి విడుదలై తిరిగి నేర ప్రవృత్తి కొనసాగిస్తున్నాడని తెలిపారు. గతంలో ఇతనిపై ఖమ్మం , నల్గొండ జిల్లాలో నమోదు అయిన సుమారు 30 కేసుల్లో 21 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్ పై తిరుగుతున్న పేరెల్లి ప్రవీణ్ కుమార్ ఏదైనా భూ వివాదం వుంటే తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా అక్రమించడం, బాధితులపై దౌర్జన్యం చేయడం, అడ్డుకున్న వారిని చంపుతానని బెదిరించడం నైజంగా మారిందని తెలిపారు.
పగడాల విజయ్ @ చంటి
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పగడాల విజయ్ @ చంటి 35సం,, పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు.
నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో తరచూ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న వారిపై తీసుకునే చట్టపరమైన కఠిన చర్యలలో భాగంగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రహారం న్యూ కాలనీ చెందిన పగడాల విజయ్ హత్యయత్నం, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, గుండాయిజం వంటి పలు కేసుల్లో కీలకమైన నిందితుడిగా వున్నట్లు తెలిపారు. పలు సందర్భాల్లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినా, మళ్లీ అనతికాలంలోనే జామిని పై విడుదలై ఖమ్మంలో తరచూ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.. ఇలాంటి అలవాటు పడిన నిందితుడి వల్ల ప్రజల భద్రతకు ముప్పు కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఇతని నేరాలు శాశ్వతంగా చెక్ పెట్టడానికి పి.డి యాక్ట్ అమలు చేసి నిందుతుడిని ఖమ్మం ఖానాపూరం హవేలి ఇనస్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలు తరలించినట్లు తెలిపారు.
