





ఖమ్మం అర్బన్ 16వ డివిజన్ లో ముస్లిం మైనారిటీ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్ బొమ్మ హై స్కూల్ కాంప్లెక్స్ లో ప్రభుత్వం నిర్వహిస్తుంది
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7 )) వెంపటి నాయుడు
ఇందులో ఇంచుమించుగా విద్యార్థినులు 550 మంది ఆడపిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు దానితోపాటుగా అందులో పనిచేసే స్టాఫ్ 50 మంది వరకు ఉంటున్నారు ఈ 600 మంది విద్యార్థుల మురుగు నీరు అంతా బయటికి వెళ్లే పరిస్థితి లేక స్కూల్ పరిధిలోనే ఆగిపోయి ఎంతో దుర్గంధం కంపు కొడుతుంది అంత మాత్రమే కాక ఈ మురుగునీరు స్కూల్ బోర్లోకి వెళ్లి బోర్ వాటర్ అంతా కలుషితమై అనేకమంది విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలడానికి కారణం అవుతుంది అంత మాత్రమే కాకుండా ఆ స్కూల్ పరిధిలో నివసిస్తున్న కాలనీవాసుల పరిస్థితి అద్వానంగానూ అగమ్యాచారంగాను అనుభవిస్తూ దోమల బెడద పందుల విహారం తో చిన్న పిల్లలతో కనీసం ఇంటి డోర్ తీసే పరిస్థితి లేక ఎంతో నరక వేతన పడుతున్నారు ఈ విషయాన్ని పలుమార్లు రాజకీయ నాయకుల దృష్టికి మరియు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్యను పరిష్కరించక మరింత జఠిలం చేస్తున్నారు కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే పరిస్థితి కొనసాగితే రాస్తారోకో నిర్వహిస్తామని ఆందోళన చేపడుతున్నారు
