ఖమ్మంలో సిపిఐ ర్యాలీ

-పాల్గొన్న అజీజ్ పాషా

ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7 )) వెంపటి నాయుడు

పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి మద్దతుగా సిపిఐ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రం నుండి జెడ్పి వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ -సభ్యులు అజీజీపాషా, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఎస్కె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీర రామ్మూర్తి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా అజీజ్పషా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతోనే పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తుందని ఆరోపించారు. మానవత్వాన్ని మరిచి ఇజ్రాయిల్ గాజాలో మానవ నివాస ప్రాంతాల్లో బాంబు దాడులు చేస్తుందని ఆయన ఆరోపించారు. -తక్షణం యుద్ధాన్ని నిలిపి వేయాలని అజీజాపాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, రావి శివరామకృష్ణ. -పుచ్చకాయల కమలాకర్, తోట రామాంజనేయులు, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, జాగర్లమూడి రంజిత్ కుమార్, -మిడికంటి చిన్నవెంకటరెడ్డి, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు