సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు
(( ఖమ్మం విఎన్బి స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు ))
- అధ్యక్ష, కార్యదర్శులుగా తోట కిరణ్, జమ్ముల రాజేష్ రెడ్డి
- అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా తోట కిరణ్ (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా జమ్ముల రాజేష్ (హెచ్ఎంటీవీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక చెర్రీస్ రెస్టారెంట్ మినీ ఫంక్షన్ హాలులో తాజా మాజీ అధ్యక్షుడు మాదిరాజు సుధాకర్ ఆధ్వర్యంలో పూర్వపు అధ్యక్షులు భీమిశెట్టి రఘు రామారావు (రాము), మొహమ్మద్ షైబుద్ధిన్ (షైబు), చీనేని బాలకృష్ణ (బాలు), రామిశెట్టి లక్ష్మణరావు సమక్షంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కొత్త కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా యనమాల విజయ్, చీపి గంగాధర్, కోశాధికారిగా కాకర్ల జగన్, కొవ్వూరి సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా నల్లటి మోహన్, బండి వేలాద్రి, ప్రచార కార్యదర్శిగా కొత్తపల్లి సుధాకర్ గౌరవ సలహాదారులుగా తడికమళ్ల దేవదానం, నరుకుళ్ల రాము, బల్లెం చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా సుధాకర్, రాము, షైబూ, బాలు, లక్ష్మణరావు వ్యవహరించనున్నారు.
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన తోట కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. పూర్వపు అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకుంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. ఈ సమావేశంలో కొర్ర బాలాజీ జీడిమల్ల శ్రీనివాస్ బండారు ఉమా, గోదా విష్ణు బాజీ, మీరా ఓబిలిశెట్టి రామారావు పాల్గొన్నారు. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, అభినందనలు తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సహకరిస్తాం
- సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్
జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని �


