KHAMMAM; ఐదేళ్లు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం కాదు ఐదు తరాల అభివృద్ధి యే అజయ్ అన్న ధ్యేయం. 👇 నగర ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి రానున్న వెజ్ & నాన్ వెజ్ మార్కెట్..
▪️ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్న అధికారులు..
▪️మంత్రి పువ్వాడ కు కృతజ్ఞతలు తెలుపుతున్నా నగర ప్రజలు..
ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి మస్తిష్కంలో నుండి జాలువారిన ఆలోచన నేడు ఆచరణలో సద్యమై త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఖమ్మం నగర ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్, నాన్‌వెజ్‌మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మిస్తున్నారు.
ఖమ్మం నగరంలోని వీడిఓస్ కాలనీలో రూ.4.50 కోట్లతో ననిర్మిస్తున్న సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.
మార్కెట్ 2.01 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో 65 వెజ్ స్టాల్స్, 23ఫ్రూట్ స్టాల్స్, 46నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్ తరువాత అంతటి ఘనమైన వసతులతో, ప్రజలకు నిత్యం అవసరమయ్యే కూరగాయలు, వెజ్ & నాన్ వెజ్, పండ్లు తదితర వస్తువులను ఒకే చోట అందుబాటులో ఉంచాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తలంచిన కల అతి త్వరలో సాకారం కానుంది.
అందుకు అధికారులు, సిబ్బంది వడి వడిగా నిర్మాణ పనులు దగ్గరుండి పూర్తి చేసేందుకు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు.
వాల్ పేయింటింగ్స్, షేడ్స్, పార్కింగ్, నీటి వసతి, విద్యుత్, తదితర సౌకర్యాలు ఇప్పటికే సమకూర్చారు.
మరో వారం రోజుల్లో ఆయా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను మంత్రి కేసీఅర్ గారి చే లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.