KHAMMAM;
ఐదేళ్లు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం కాదు ఐదు తరాల అభివృద్ధి యే అజయ్ అన్న ధ్యేయం. 👇
నగర ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి రానున్న వెజ్ & నాన్ వెజ్ మార్కెట్..

▪️ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్న అధికారులు..

▪️మంత్రి పువ్వాడ కు కృతజ్ఞతలు తెలుపుతున్నా నగర ప్రజలు..

ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి మస్తిష్కంలో నుండి జాలువారిన ఆలోచన నేడు ఆచరణలో సద్యమై త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఖమ్మం నగర ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మిస్తున్నారు.

ఖమ్మం నగరంలోని వీడిఓస్ కాలనీలో రూ.4.50 కోట్లతో ననిర్మిస్తున్న సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

మార్కెట్ 2.01 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో 65 వెజ్ స్టాల్స్, 23ఫ్రూట్ స్టాల్స్, 46నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.

హైదరాబాద్ తరువాత అంతటి ఘనమైన వసతులతో, ప్రజలకు నిత్యం అవసరమయ్యే కూరగాయలు, వెజ్ & నాన్ వెజ్, పండ్లు తదితర వస్తువులను ఒకే చోట అందుబాటులో ఉంచాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తలంచిన కల అతి త్వరలో సాకారం కానుంది.

అందుకు అధికారులు, సిబ్బంది వడి వడిగా నిర్మాణ పనులు దగ్గరుండి పూర్తి చేసేందుకు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు.

వాల్ పేయింటింగ్స్, షేడ్స్, పార్కింగ్, నీటి వసతి, విద్యుత్, తదితర సౌకర్యాలు ఇప్పటికే సమకూర్చారు.

మరో వారం రోజుల్లో ఆయా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను మంత్రి కేసీఅర్ గారి చే లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు