ఆమె’… తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది… భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు

కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనం!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి.. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!!

‘‘అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ – హ్యాపీ ఉమెన్స్ డే!

అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. స్త్రీమూర్తి గొప్పతనమంటే.
హ్యపీ ఉమెన్స్ డే!

అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..

వనితామణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు