Khammam/06.04.2023

For Scroll;

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

▪️178 మందికి గాను రూ.1.78 కొట్లు.. నేటి వరకు 8106 చెక్కులకు గాను 76.13 కోట్ల పంపిణీ చేయడమైంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ షాది ముభారక్ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మంజూరైన 178 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.1.78కోట్ల రూపాయల విలువగల చెక్కులను VDO’s కాలనిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు.

నేడు ఒకే సారి 178 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇవ్వడం జరిగిందని, నేటి వరకు 8106 చెక్కులకు గాను 76.13 కోట్ల రూపాయలు అందజేయడం గర్వంగా ఉందన్నారు. ఇంత భారీ మొత్తం లో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.

కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, RDO రవీంద్రనాథ్, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed