ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన మంత్రులు హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు..

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్…

కల్లూరు మండలం సగం మీటింగ్ లో ఉన్న మంది కూడా అమిత్ షా మీటింగ్ లో లేరు.

నాలుగు జిల్లాల నుండి నిన్న తరలించారట.

అధికారం లోకి వస్తామని చెబుతున్న బిజెపి మాటలు ఎండమావిలాంటివి.

ఖమ్మం జిల్లాలో డిపాజిట్ వస్తుందా, అది రాష్ట్రంలో అధికారం లోకి వస్తుందా..

నిజం చెప్పకుంటే అబద్ధాలు ప్రచారం అవుతాయని అంబేద్కర్ గారు చెప్పారు. మీరంతా మనం చేసింది చెప్పాలి, ప్రచారం చేసుకోవాలి.

యాసంగి పంట 2014లో 14 లక్షల ఎకరాలు పండితే, నేడు 56 లక్షల ఎకరాల్లో పంట పండింది.

2014లో 3600 కోట్లు పంట కొనుగోళ్లు చేస్తే, గతేడాది 26,600 కోట్లు కొనుగోలు చేశాం.

దేశంలో మొత్తం ఎంత పంట పండుతున్నదో.. ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే అంత పంట పండుతున్నది.

కరువు అనే పదాన్ని సీఎం కేసీఆర్ గారు డిక్షనరీ నుండి తొలగించారు.

అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దు, రైతు ప్రభుత్వం మనది. రైతు నాయకుడు కేసీఆర్.

మొన్న పంట నష్టపోతే ఎకరాకు 10 వేలు ప్రకటించారు.

ఇప్పుడు కూడా అకాల వర్షాల వల్ల నష్టపోయారు. కేసీఆర్ గారు ఉన్నడు. రైతులు అధైర్య పడొద్దు.

పంట నష్టం అంచనా వేయాలని సిఎస్ గారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఛత్తీస్ గడ్ లో యాసంగిలో ఒక్క గింజ కొనరు. కానీ తెలంగాణలో ప్రతి గింజ రెండు పంటలు కొనుగోలు చేస్తున్నం.

కేసీఆర్ రైతు విలువ పెంచారు కాబట్టి, భూముల విలువ పెంచారు.

కర్ణాటకలో ఓటమి తప్పదు అనే ఫ్రస్టేషన్ లో అమిత్ షా ఉన్నాడు.

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.

నిన్న వచ్చి ఏం చెప్పాడు.
1350 కోట్లు హక్కుగా రావాల్సిన దాని గురించి చెప్పాడా.. బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి చెప్పాడా.. జాతీయ ప్రాజెక్టు గురించి చెప్పాడా..

ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలు కలిపారు.
పేపర్ లీకేజీ అయిన వాడిని పక్కన పెట్టుకున్నావు

కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏముంది. రైతులకు కరెంట్, ఎరువులు ఇవ్వలేదు. ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తారు.

హామీ ఇవ్వకుండా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.

కేసీఆర్ ప్రజల కోసం పోరాటం చేశారు. ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ వాళ్ళు, గుజరాత్ వాళ్లకు బిజెపి వాళ్ళు గులాంగిరి చేస్తారు.

కానీ ప్రజలే బాసులుగా పని చేసే వారు భట్టి విక్రమార్క గారు మధిరలో 100 పడకల ఆసుపత్రి తెచ్చుకోలేదు.

కాంగ్రెస్ వాళ్లు వస్తె రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ పథకాలు పోతాయి.

ఖమ్మం జిల్లాలో ప్రారంబించిన కంటి వెలుగు విజయ వంతంగా కొనసాగుతున్నది.

1.17 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశాం. మొత్తం 2 కోట్ల మందికి చేస్తాం.

మహారాష్ట్ర లో నాలుగు రోజులకు ఒక సారి నల్లా వస్తది. కానీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోజూ నల్లా ద్వారా నీళ్ళు వస్తాయి

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు.. డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలు.

ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది మనమే.

ఖమ్మంలో ఉన్న నాయకులు ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు.

గతేడాది కొత్తగూడెంలో, ఈ ఏడాది ఖమ్మం మెడికల్ కాలేజీ వచ్చింది.

సీతారామ ప్రాజెక్టు నీళ్ళు మూడు నాలుగు నెలల్లో ఖమ్మంలో ప్రతి మండలానికి తెస్తాం. ప్రతి పంటకు నీళ్ళు అందిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed