తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు
శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 46 వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఉచితంగా అందించే కళ్లద్దాలను పొందాలని కోరారు.
ఒకవేళ చికిత్స అవసరం ఐనచో ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించబడతాయని తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు చేయాలనే సదుద్దేశంతో భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా సరికొత్త పథకాన్ని కెసిఆర్ గారి రూపొందించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారని తెలియజేశారు.
సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ గారు మాట్లాడుతూ కెసిఆర్ గారు జనరంజకమైన పాలన అందిస్తున్నారని, పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, వారి ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కంటి వెలుగు ఫిబ్రవరి ఏర్పాటు చేసి ప్రజలకు సేవన అందిస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ , బి ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ,
డిప్యూటీ DM&HO, రాంబాబు, డా. పవన్ కుమార్, డా. సుప్రియ , ప్రత్యేక అధికారి సత్యశీల, ANM శారద,
మాజీ కౌన్సిలర్ వంగాల వెంకట్, డివిజన్ నాయకులు తొగరు భాస్కర్, బొల్లెపల్లి విజయ్, దేవర వెంకన్న, కాల్వొడ్డు శ్రీను, మీరా సాహెబ్, గొరిగె నాగులు, చేతి కృష్ణ, కాటం కొమురయ్య, కాటం యాదయ్య, జెట్ట కృష్ణయ్య, కన్నం రమేష్, బొడ్డు పల్లి వెంకన్న, అజీజుల్లా బేగ్, మోయిన్ మరియు
కంటి వెలుగు వైద్య సిబ్బంది,అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు