పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు..

▪️కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ..

▪️117 మందికి రూ.1.17కోటట్లు, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ..

▪️లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పువ్వాడ.

పేదల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు.

ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గం పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మంలో 73, రఘునాధపాలెంలో 44 మొత్తం 117 చెక్కులు పంపిణీ చేశామని, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, ఆసరా పెన్షన్లు, సాగు, త్రాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్‌ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు.

రైతులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు కరెంటు కష్టాల నుండి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ గారు తన పాలనతో విముక్తి కల్పించారని వారు తెలిపారు.

ఖమ్మం నగరంలో ఏ దిక్కున చూసిన అభివృద్ది ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది అని, ఖమ్మం నగరాన్ని అభివృద్ది చేసుకున్నందుకు BRS రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రానున్న రోజుల్లో BRS ప్రభుత్వాన్ని గెలులిపించుకోవలని, కేసీఅర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు.

అనంతరం లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ స్వయంగా వడ్డించారు. అనంతరం వారి కుటుంబీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు