పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం..

▪️పేదల ఇళ్లకు పట్టలు కల్పించడం ఇదే తొలిసారి.

▪️మీ జాగా ను మీకే ఇస్తున్నాం..

▪️ఒకే డివిజన్ లో 424 మందికి పట్టాలు..

పేదలకు శాశ్వత నివాస యోగ్యం కల్పించి, వారి ఆత్మగౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.

ఖమ్మం నగరం 17వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలవకట్టపై నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన GO.No.58&59 ద్వారా మంజూరైన పట్టాలను శనివారం బృందావనం గార్డెన్స్ నందు మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓనెం.58, 59 పథకం క్రింద ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లోనే మొదటిగా జి.ఓనెం. 58, 59 పథకం క్రింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్దం చేసి మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిందన్నారు.

ఈ పథకం ద్వారా ఖమ్మం నగరంలో 2800 మందికి ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి అక్కడే స్థిర నివాసం ఉండేందుకు హక్కు పత్రాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ గారిది అని అన్నారు.

గడువు ముగిసినప్పటికీ మంత్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల మళ్ళీ పొడిగించడం జరిగిందని, మిగిలి ఉన్న వారు ధరఖాస్తు చేసుకోవాలని మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని స్పష్టం చేశారు.

ఒకే సారి డివిజన్ లో ఇంత పెద్ద ఎత్తున పేదలకు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నరు. వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయొచ్చు గాకా… కానీ పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తూ ఇలాంటి పనులు చేయడం ద్వారా జీవితానికి ఒక సంతృప్తిని ఇస్తుందన్నారు.

ఒకప్పుడు ఖమ్మం నేడు ఖమ్మం ఎలా ఉంది.. కనీసం ప్రయాణించడానికి రోడ్లు సరిగా లేక, విద్యుత్ దీపాలు లేక, త్రాగునీరు లేక, అధ్వానంగా ఉన్న సైడుకాల్వలు ఇలాంటి మరెన్నో సమస్యల నుండి నేడు ఖమ్మం నగరంలో హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో రూ.180 కోట్లతో నగరంలో మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి త్వరలో కట్టుకోబోతున్నమని గుర్తు చేశారు. ఇది ఎవరైనా ఊహించి ఉంటారా… అని అన్నారు.

ఇన్ని చేస్తున్న BRS ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని మళ్ళీ ముఖ్యమంత్రి గా కేసీఅర్ గారినే గెలిపించుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో RDO రవీంద్రనాథ్, కార్పొరేటర్లు ధనాల రాధ కొండయ్య, గజ్జెల లక్ష్మీ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, AMC చైర్మన్ శ్వేత, MRO శైలజ, RJC కృష్ణ, పగడాల నాగరాజు, పాలడుగు పాపారావు, ధనాల శ్రీకాంత్, మాటురి లక్ష్మీనారాయణ, నీలం కృష్ణ, వడ్డెల్లి లెనిన్, మస్తాన్, కన్నం ప్రసన్న తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు