





వి ఎన్ బి న్యూస్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు
ఖమ్మం బడ్జెట్ హోటల్ నందు జరిగిన జిల్లా ఆర్య వైశ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..
ఖమ్మం నగరంలోని వర్తక, వ్యాపారుల వ్యాపారానికి కపాలదరుడిగా ఉంది నిబద్దతో పని చేశామన్నారు.
మా నాన్న గారు నాకు ఇచ్చిన అస్తి ఆర్య వైశ్యులు అని స్పష్టం చేశారు.
ఒకప్పుడు దుర్భరమైన స్థితిలో ఉన్న ఖమ్మం త్రీ టౌన్ నేడు అద్భుతంగా అభివృద్ధి చెందిన విషయం గుర్తు చేశారు. దశాబ్దాల నాటి నుండి వివక్షకు గురైన త్రీ టౌన్ ను నేడు రోడ్లు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ, పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, కుడళ్ళ అభివృధ్ధి, మార్కేట్ లు, గాంధీ చౌక్ అభివృద్ధి, వీధి వ్యాపారుల ప్రాంగణాలు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి ఇలా అనేక పనులు చేశామని గుర్తు చేశారు.
ఎన్నికైన నాటి నుండి వర్తక వ్యాపారుల వద్ద నుండి ఒక్క కర్చీఫ్ కూడా తీసుకోలేదని, ఆ సంస్కృతి లేదని, కేవలం వర్తక వ్యాపారుల అభివృద్ధి మాత్రమే కోరుకునే అభిమతం మా నాన్న గారు నాకు ఇచ్చారని అన్నారు.
మీరు చేస్తున్న విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఆర్య వైశ్య కార్పోరేషన్ ఎర్పాటు చేయడానికి, అందుకు తగు కార్యాచరణ చేశారని త్వరలోనే దాన్ని ప్రకటిస్తానని చెప్పారు.
సంఘం నాయకుడు కొత్త వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, వనమా సూరి, వేములపల్లి వెంకటేశ్వరరావు, దేవత అనిల్, కురువెల్ల ప్రవీణ్, వనమా విశ్వేశ్వరరావు, రాయపూడి వెంకట రామారావు, వదినేపల్లి శ్రీనివాసరావు, G y నరేష్, వర్తక, వ్యాపారులు, పుర ప్రముఖులు తదితరులు ఉన్నారు
