వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

ప్రజా అవసరాల కోసమే కోట్లాది రూపాయలతో ఇన్ని అభివృద్ది పనులు..మంత్రి పువ్వాడ.

▪️8గ్రామాల్లో రూ.16.24 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ.

▪️కామేపల్లి మండలంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన .

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గారితో కలిసి రూ.16.24 కోట్లతో చేపట్టనున్న పలు పనులను ప్రారంభించి, పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.

కామేపల్లి మండలం రాయగూడెం గ్రామంలో రూ.3కోట్లతో రాయగూడెం నుండి రుక్కితండా మీదుగా బండిపాడు వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

బర్లగూడెం గ్రామం నుండి కొత్తతండా రోడ్డు వరకు రూ.1.05కోట్లతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభోత్సవం చేశారు.

కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామం కోయచెలక నుండి కమలాపురం రోడ్డు వరకు రూ.60 లక్షలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

కామేపల్లి మండలం నెమలిపురి గ్రామంలో నెమలిపురి నుండి నెమలిపురి తండా వరకు రూ.49లక్షలతో నిర్మించనున్న బిటి రోడ్డును ప్రారంభోత్సవం చేశారు.

పింజరమడుగు గ్రామం పింజరామడుగు నుండి నెమలిపురి వరకు రూ.2.10కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

హరిచంద్రపురం గ్రామంలో శ్రీరాంనగర్ తండా కు వెళ్లేందుకు రూ.1.75కోట్లతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభోత్సవం చేశారు.

మర్రిగూడెం గ్రామం మరిగూడెం నుండి కెప్టెన్ బంజారా వరకు రూ.3.10 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

పాత లింగాల గ్రామం జాస్తిపల్లి నుంచి పాత లింగాల వరకు రూ.3కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కోత లింగాల గ్రామం ఖమ్మం-ఇల్లందు రోడ్డు నుండి జాస్తిపల్లి వరకు రూ.1.15 కోట్లతో చేపట్టిన బిటి రెన్యూవల్ పైలాన్ ను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృధ్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని, ముఖ్యంగా ప్రజలకు అవసరం అయ్యే మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు.

ప్రజల కోసం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులే తమ పనితీరుకు నిదర్శమని వారు పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి వారి సమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన కర్తవ్యమని మంత్రి అన్నారు.

రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, కాల్వల నిర్మాణం వంటి అనేక పనులను చేపట్టామని వెల్లడించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, RDO రవీంద్రనాథ్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు