💥జర్నలిస్టుల ఇళ్లస్థలాలకు 23.5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషి అభినందనీయం
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు 23 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధతో జీవో విడుదల కాపటం పట్ల TUWJ(TJF) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంతి రెడ్డి, తెంజు జిల్లా అధ్యక్ష ప్రధాన రామకృష్ణ, రజినీకాంత్, సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ బాషా, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, నగర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలబత్తుల రాఘవ, అమరవరపు కోటేశ్వరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్ తదితరులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

