పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

నేటి నుంచి పోలీసు ఉద్యోగాల‌కు స‌ర్టిఫికెట్‌ వెరిఫికేష‌న్ ప్రారంభం.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు ఉద్యోగాల‌కు స‌ర్టిఫికెట్‌ వెరిఫికేష‌న్ నేటి నుంచి పదకొండు రోజులపాటు కొనసాగుతుంది. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్
సుభాష్ చంద్ర బోస్ పక్రియ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణ‌లో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తుది రాత‌ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల చేసింది. కాగా నేటి నుంచి 26వ తేదీ వ‌ర‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కొన‌సాగ‌నుంది. తుది రాత ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు బోర్డు సూచనల మేరకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ మార్గదర్శకాల అనుసరించి సంబంధిత పత్రాలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి వుంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కేంద్రంలోనే అప్లికేషన్‌ ఎడిటింగ్‌/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాల్సి వుంటుంది, అందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు బోర్డు సూచించిన విధంగా పత్రాలతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, బీసీ అభ్యర్థులు నాన్‌ క్రీమిలేయర్‌ సర్టిఫికెట్‌ , ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు,
బెనిఫిట్స్‌ రిలేటెడ్‌ సర్టిఫికెట్లు, తదితర ఒరిజినల్స్‌, జిరాక్స్‌ల సెట్‌ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల‌ని సూచించారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, కార్యాలయ ఏవో అక్తరూనీసాబేగం, సిఐ శ్రీనివాస్, RI తిరుపతి, సెక్షన్ సూపరిండెంట్ జానకి రామ్ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. పి ఆర్ వో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు