వి ఎన్ బి న్యూ స్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు భద్రాచలం

మంత్రి పువ్వాడ ఏరియల్ సర్వే..

▪️చర్లలోని పునరావాస కేంద్రంకు వెళ్లి బాధితులను కలిసి వారితో మాట్లాడారు

ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి చుట్టుపక్కల పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన వరదల నేపథ్యంలో సీఎం కేసీఅర్ గారి ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రభుత్వం ఎర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఏరియల్ సర్వే భద్రాచలం నుండి చర్ల వరకున్న గోదావరి పరివాహక ప్రాంతంలో కొనసాగింది. చర్ల గ్రామంలో దిగి అక్కడ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం GP పల్లి లో గల పునరావాస కేంద్రంలో బాధితులను కలిసి వారితో మాట్లాడి, అక్కడ అందుతున్న సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సర్వేలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతాలో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను మంత్రి పువ్వాడ నేరుగా పర్యవేక్షించారు.

ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు