Khammam/15.08.2023

VNB TV NEWS kmm VEMPATTI NAIDU

రెండు వేల అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ..

▪️జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బోడెపుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వేల మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాను ఖమ్మం నగరంలోని ఇందిరా నగర్ సర్కిల్ నుండి చేపట్టిన ర్యాలీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశభక్తిపై ఉన్న మక్కువతో ఇలాంటి అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను చైతన్య పరచిన నిర్వాహకులను మంత్రి పువ్వాడ అభినందించారు.

అనంతరం 2000 వేల మంది పలు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి వి.ఆర్.కె సిల్క్ నుండి పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ ని నిర్వహించారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం కృషి చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ రోడ్డు పొడవునా నినాదాలు చేశారు .

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బోడేపూడి రాజా, సుడా చైర్మన్ విజయకుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసి బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు, బోడెపుడి ట్రస్ట్ సభ్యులు విక్రమ్, అనిల్, వెంకటేష్, రిత్విక్, పొట్లకాయ నితీష్, అఫ్రీధ్, అఫ్రోజ్, సుమన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed