ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం… ఐక్యమత్యమే మన బలం , మన బలగం…….

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో లకారం ట్యాంక్ బండ్ వద్ద ఇటీవల నూతనంగా ప్రారంభమైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఐక్యమత్యంతో మన బలాన్ని చాటుకుంటే , రాజకీయ పార్టీలు వాటంతటవే పిలిచి మరీ టిక్కెట్లుస్తాయని ఐక్యత లేకపోవడమే మన బలహీనతగా మారిందని ఐక్యత పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు . ఇలాంటి సమావేశాలు ఎన్నో పెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లాలో బీసీ సంఘం ఇంకా బలపడాలని కోరారు . త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉన్న బీసీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనంతరం పెద్ద ఎత్తున ఖమ్మం కేంద్రంగా బహిరంగ సభను నిర్వహించాలని సూచించారు . దీనికోసం బీసీ బిడ్డగా నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు . మరో ముఖ్య అతిథి డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఈ సంఘాలు ఇంకా బలంగా ముందుకు పోవాలని అప్పుడే బీసీలకు న్యాయమైన వాట దక్కుతుందని అన్నారు . టిడిపి పార్టీ రాష్ట్ర నాయకులు పాల్వంచ రామారావు మాట్లాడుతూ బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాలుగా బీసీల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తామని బీసీల అందరిని కలుపుకుని పోతామని అన్నారు . మరోఅతిథి పోలీస్ వెంకన్న మాట్లాడుతూ తమ వంతు సహాయంగా ఎల్లవేళలా బీసీల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు . జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంఘ కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని , పార్టీలకతీతంగా కొనసాగుతుందని చెప్పారు . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ అందర్నీ కలుపుకొని పోతూ ముందుకు వెళ్తామని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు , జిల్లా కార్యదర్శి గూడిద రామకృష్ణ , జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి సుగుణ , యువజన విభాగం జిల్లాఉపాధ్యక్షులు భరత్ కార్యదర్శి రేపాకుల రామకృష్ణ , సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు , సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు , బీసీ జేఏసీ అధ్యక్షుడు రమేష్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు