తేజ వార్త ఖమ్మం సిటీ

సిఎం కేసీఅర్ గారి చిత్రపటానికి సాంస్కృతిక సారధి ఉద్యోగులచే క్షీరాభిషేకం..

▪️కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి సత్కారం..

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఖమ్మం జిల్లా సాంస్కృతిక ఉద్యోగులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు ఖమ్మం Vdo’s కాలనిలోని క్యాంపు కార్యాలయంలో కేసీఅర్ గారి చిత్రపటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తిస్తుంది అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో జనులను చైతన్య పరచి, జనాన్ని జాగృత పరచిన కళాకారులకు వేతనాలు పెంపు పట్ల హర్షం తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన కేసీఅర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుత పే స్కేలు మీద 30% పీఆర్సీని అమలు చేయనున్న ప్రభుత్వం సారధిల ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹ 24514 కాగా ఒక్కొక్కరికి ₹ 7300 ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వంలో పని చేస్తున్న చిన్న ఉద్యోగులను సైతం కేసీఅర్ గారు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో మళ్లీ BRS ప్రభుత్వంను గెలిపించుకునే హ్యాట్రిక్ కొట్టే విధంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సాంస్కృతిక సారథులు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా ఉమ్మడి తెలంగాణ సాంస్కృతిక సారథులు 30% పిఆర్సి సారధులకు కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారికి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి, చైర్మన్ రసమయి బాలకిషన్ గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథులు పాగి వెంకన్న, పమ్మి రవి, మిమిక్రీ సుధాకర్, బమ్మెర ముత్యం, కాల్వకట్ట జాన్, బీరెల్లి రమణ, యంగల కుమారి, గోవింద, గురవయ్య, అలవాల కృపానందం, కొమ్ము రమేష్, నకిరేకంటి వెంకటేశ్వర్లు, పిడియాల లక్ష్మణ్, మునగాల వెంకటరత్నం, కొండ్రు హుస్సేన్, మాచర్ల కృష్ణ, మేడ ముత్తయ్య, బానోతు రవి, సిహెచ్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు