సినీనటి కృతిశెట్టి.. మంత్రి పువ్వాడ చేతుల మీదుగా 17వ షోరూం ఆరంభం

ఖమ్మంలో సందడి చేసిన సినీనటి కృతిశెట్టి, జబర్దస్త్ టీమ్

సరికొత్త హంగులతో ఖమ్మంలో రెండవ బ్రాంచ్ ప్రారంభం

భారీగా తరలివచ్చిన అభిమానులు

ఖమ్మం సెప్టెంబర్ 2: ఖమ్మంలో అదునాతన హంగులతో సరికొత్త గా రూపుదిద్దుకున్న ది చెన్నై షాపింగ్ మాల్ అట్టహసంగా ప్రారంభమైంది.
ఖమ్మంలోని బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన 17వ చెన్నై షాపింగ్ మాల్ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి కృతిశెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ లు షోరూంను ప్రారంభించారు.
శనివారం ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటి కృతి శెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్దన్ రెడ్డి, మర్రి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మర్రి జమునా రెడ్డి, మర్రి మధుమతి లు జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.
పట్టు ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, జ్యూయాలరీ, పలు వస్త్ర అభరణాల విభాగాలను ప్రారంభించారు.

  • చెన్నై షాపింగ్ మాల్ ను ఆదరించండి.
    తక్కువ ధరలకే వస్త్ర అభరణాలను పొందండి
    సినీనటి కృతిశెట్టి :- చెన్నై షాపింగ్ మాల్ ది బెస్ట్ షాపింగ్ మాల్ . ఖమ్మంలో రెండవ బ్రాంచ్, రాష్ట్రంలో 17వ షోరూం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని, అన్ని షోరూంలో కంటే నమ్మకమైన నాణ్యమైన సరసమైన ధరలకు లభించే వస్త్ర, అభరణాలు చెన్నై షాపింగ్ మాల్ లోనే లభిస్తాయని ప్రముఖ సినీనటి కృతిశెట్టి అన్నారు. మీ ఇంట జరిగే వేడుక ఏదైనా ఆ వేడుకకు గౌరవాన్ని తెచ్చే విధంగా వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్ లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. మీ ఆదరభిమానాలు నాకు ఎల్లకాలం ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని , అందుకు మీ ప్రేమ ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
    ఈ సందర్భంగా కృతిశెట్టి నూతన పట్టు వస్త్రాలను ప్రదర్శించారు. బంగారు, వెండి అభరణాలను ధరించి చూపరులను కనువిందు చేశారు. ఖమ్మం కు సినీనటి కృతిశెట్టి రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. షోరూం పరిసరాలు జన సందోహంతో నిండిపోయింది. కేరళ కళాకారుల నృత్యాలు, జబర్దస్త్ టీం హాస్యవల్లరి అభిమానులను ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు