***పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు *”

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు అర్హులైన వారికి మంజూరు చేసిన లైసెన్స్ ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.తొలుత మూడు బొమ్మల సెంటర్ TVనుండి పత్తి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.రవాణా శాఖ మంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పువ్వాడ కు పలువురు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. భారీ గజమాలతో మంత్రి పువ్వాడను సత్కరించారు.అనంతరం లైసెన్స్ లు పొందిన 150 మందికి వారికి స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కామెంట్స్..

ఖమ్మం మార్కెట్ వరంగల్ ఎనిమావిల మార్కెట్ తో పోటీ పడుతుంది.

మన మార్కెట్ కు పక్క జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా సరుకు వస్తుంది.

ఎవరైతే కుటుంబ సభ్యులు పోయారో వారికి కూడా లైసెన్సులు ఇప్పిచాం.

దొరెపల్లి శ్వేత చైర్మన్ అయిన దగ్గర నుండి లైసెన్సులు ఇవ్వాలని ప్రతి నిత్యం అడిగేవారు.

నేను దేనికి భయపడను.. కానీ అవినీతికి భయపడతా.

కొంతమంది ఎచ్చిపిచ్చి మాటలు మాట్లాడతారు. వారి స్థాయి మరిచి అబద్ధాలు ప్రచారం చేస్తారు. కాని ప్రజలకు అన్ని తెలుసు.

అర్హులైన వారికి మాత్రమే లైసెన్సులు ఇవ్వండి అని సూచించా. అలనే ఇస్తున్నాం.

అర్హులైన వారి వద్ద నుండి అధికంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడని హెచ్చరించా.

ఇతర జిల్లాలో లైసెన్స్ మంజూరులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముందుగా అర్హులైన 150 మందికి లైసెన్సులు మజూరు చేశాం. మరో 20 మందికి లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.

ఈ సంవత్సరం అకాల వర్షాల కారణంగా మిర్చి పంట ఎక్కువగా పండలేదు.

నా హయాంలో దాదాపు గా 300 మందికి లైసెన్సులు మంజూరు చేశాం.

మీ వల్ల మార్కెట్ నడవడం కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు సాయం చేస్తున్నాం.

ఈ రోజు ఖమ్మం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు మంజూరు చేపించుకుని వచ్చాను.

ఒకప్పుడు కొంతమంది దుర్బుద్ధితో ఇక్కడి నుండి మార్కెట్ తరలిపోతుంది అని దుష్ప్రచారం చేశారు.

75 ఏళ్ల భారతంలో ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది ఇప్పుడే.

మరొక్కసారి అవకాశం వస్తె హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం అన్నట్లుగా అభివృద్ధి చేసి చూపుతా.

మీరంతా అప్రమత్తంగా ఉండాలి.. ఎన్నికలు రాగానే కొంత మంది గజకర్ణ గోకర్ణ వేషాలు వేసుకొని వస్తారు.

ఇంత అభివృద్ది చెందిన ఖమ్మం నియోజకవర్గాన్ని మళ్లీ తిరిగి వెనుకకు నెట్టాలని చూస్తారు. తస్మాత్ జాగ్రత్త.

రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ భూమి పుత్రుడికి అవకాశం ఇవ్వాలి..

పక్క ఊరు వాడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే గెలిచాడు అంటే వాడు తిరిగి వాడి ఇంటీకి వెళ్తాడు.

నేను కానీ మా నాయన కానీ ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టుకుని ఉన్నాం. ఇక్కడికి పోయేది లేదు.

ఈ నియోజకవర్గం మా ఇల్లు.. మీరంతా నా కుటుంబ సభ్యులు.

సీఎం కెసిఆర్ గారిని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించండి.

లైసెన్సులు పొందిన వారు ఇతరులకు భినామీలు కాకూడదు.

నేను 150 కి 150 మందికి లైసెన్సులు ఇవ్వాలని వచ్చా కానీ కేవలం 22 మందే రుసుము చెల్లించారంట.. మిగతా వారు కూడా ఆ రుసుము చెల్లించండి.

మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత కామెంట్స్..

మంత్రి పువ్వాడ అజయ్ గురించి కూడా చాలా మందికి తప్పుగా ప్రచారం చేశారు.

అభివృద్ది, సంక్షేమం పట్ల చాలా మందికి ఉన్న ఎన్నో అపోహలను తొలగించాం.

అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి విడత కింద 150 మందికి లైసెన్సుల అందిస్తున్నాం.

ఎన్నికలు ముందున్నప్పటికి పేదలకు న్యాయం జరగాలన్న సంకల్పంతోనే మంత్రి పువ్వాడ గారి సూచనల మేరకు లైసెన్సులు మంజూరు చేస్తున్నాం.

ఎవ్వరూ అధైర్య పడొద్దు. అర్హులైన వారికి లైసెన్స్ లు ఇస్తాం.

మంత్రి పువ్వాడ 75 ఏళ్ల ఖమ్మం చరిత్రను తిరగరాశారు. కేవలం నాలుగేళ్లలో కనివిని ఎరుగని రీతిలో వేల కోట్లతో అభివృద్ది చేసి చూపించారు.

నిజాయితీతో నిబద్ధతతో ఇంత పారదర్శకంగా లైసెన్సులు ఎవ్వరూ ఇవ్వలేదు.

లైసెన్సుల మంజూరులో ఎటువంటి పైరవీలు లేకుండా మంజూరు చేస్తున్నాం.

మంత్రి పువ్వాడ అజయ్ మంత్రిగా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పాలకవర్గం, మార్కెట్ ఉద్యోగులు, వ్యాపారులు, రైతుల తరుపున మా శుభాకాంక్షలు.

ఖమ్మం జిల్లాలో గతంలో రూ.100 కోట్లు కేటాయిస్తేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం.. కానీ మంత్రి పువ్వాడ అజయ్ రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేశారు.

ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ గారికే మన ఓటు. మళ్ళీ వారికి హ్యాట్రిక్ అందించాలి.

మోటార్ సైకిల్ మీద ఇంటింటికీ తిరుగుతూ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన నాయకుడు మంత్రి పువ్వాడ.

మంత్రి పువ్వాడ అజయ్ అవసరం జిల్లాకు ఉంది. ఆయన ఓటు కోసం బయట తిరగకుండానే ఓట్ వేసి ఆయనను గెలిపించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed