Khammam/10.09.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

శ్రీ విరాట్ విశ్వకర్మ గారి జయంతి కార్యక్రమములో పాల్గొన్న మంత్రి పువ్వాడ.

శ్రీ విరాట్ విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పటానికి పూల మాలలు సమర్పించి  జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఆదివారం ఖమ్మం జిల్లా కొత్త కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు శ్రీ విరాట్ విశ్వకర్మ గారి పటానికి పూలమాలలు సమర్పించారు… ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ఈ సృష్టికి పూర్వమే స్వయంభూవుగా వెలసిన రూపమే విశ్వకర్మ రూపం. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు. ఈ ఐదుగురు బ్రాహ్మణులు విశ్వకర్మ నుండి ఐదు శక్తులను గ్రహించి, ప్రతిభను ప్రదర్శించడంలో అమూల్యమైన  నైపుణ్యంతో ఈ ప్రపంచాన్ని సృష్టించారు మరియు ప్రపంచ అభివృద్ధికి సహాయం చేసారని కొనియాడారు….
ఈ కార్యక్రమములో మేయర్ పునుకొల్లు నీరజ, Z P చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, సుడా చైర్మన్ విజయ్ కుమార్,  పగడాల నాగరాజు, MBC రాష్ట్ర కన్వినర్ షేక్ షకీనా, మేకల సుగుణారావు,  మోడేపల్లి కృష్ణమాచారి, అద్దంకి నాగేశ్వరరావు, సైదాచారి ఇంద్ర చారి,నాగాచారి , కణతాల నర్సింహరావు, బొమ్మ రాజేశ్వర రావు గారు, పద్మా చారి, పెరుగు వెంకట రమణ యాదవ్, బీసీ సంఘాల నాయకులు మరియు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీమతి గుడికందుల జ్యోతి, డివిజన్ ఆఫీసర్లు ఈదయ్య, నర్సయ్య , AO మాధవి మరియు కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు