Raghunadapalem/28.09.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోయచలక, రేగులచలక గ్రామాల్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డొంక రోడ్లు, హై మాస్ట్ లైట్స్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.

▪️కోయచలక గ్రామంలో సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రెయిన్ల కోసం NREGS నిధులు రూ.30లక్షలు, SDF నిధులు రూ.10 లక్షలు, CSR TRANSCO నిధులు రూ.17లక్షలు (డొంక రోడ్లు) SUDA నిధులు రూ.3.50 లక్షలతో హై మాస్ట్ లైట్స్ మొత్తం రూ.60.50 లక్షాతో నిర్మించిన పనులను ప్రారంభించారు.

▪️రేగుల చలక గ్రామంలో సీసీ రోడ్స్ కోసం NREGS నిధులు రూ.33.50(ఎనిమిది రోడ్స్), SDF నిధులు రూ.10 లక్షలు(మూడు రోడ్స్), CSR TRANSCO నిధులు రూ.13 లక్షలు(రెండు డొంక రోడ్లు) SUDA నిధులు రూ.3.50 లక్షలతో హై మాస్ట్ లైట్స్ మొత్తం రూ.60 లక్షలతో అభివృద్ది పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా BRS శ్రేణులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రఘునాధపాలెం మండలంలో ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల నిధులు వరదలా పరించడం జరిగిందన్నారు.

ఇంత అభివృద్ది చేసేందుకు మంత్రి పదవి అనే మంత్ర దండం నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంకు మంత్రి పదవి రాలేదు.. కేసీఅర్ గారు ఆ అవకాశం నాకు ఇవ్వడం వల్లే నేడు ఇంత అభివృద్దిని చూస్తున్నారు.

మొన్ననే మళ్ళీ మండలంకు 12 రోడ్ల(BT)కు గానూ రూ.25 కోట్లు తీసుకొచ్చినం అని, త్వరలో శంకుస్థాపన చేసి పూర్తి చేసి మీకు అందిస్తామని అన్నారు.

రఘునాథపాలెం మండలంకు ఇప్పటి వరకు దాదాపు రూ.350 కోట్లు తీసుకొచ్చినం.. SDF, SUDA, CDP, CSR TRANSCO, NREGS, HUDCO, PMGSY, R&B ఇలా అనేక పథకాల ద్వారా కోట్ల రూపాయల నిధుల వరద పారించడం జరిగిందన్నారు.

అర్బన్ మండలంగా ఉన్న దానిని రఘునాథపాలెం మండలంగా మార్చి, మండలానికి ఒక స్వరూపాన్ని ఎర్పాటు చేసి ఒకే దగ్గర తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ఎండిఓ, సుడా పార్క్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఎర్పాటు చేశామన్నారు.

ఇప్పటికే కార్పొరేషన్ పరిది విస్తరించి మండలంను తాకిందని, రోడ్లు విస్తరించినం, సెంట్రల్ లైటింగ్ ఎర్పాటు చేశాం.. రోడ్ల చుట్టూ వెలుగులు తీసుకురావడం ద్వారా అర్థ రాత్రి సైతం ప్రజలు నిర్భయంగా ప్రయాణాలు చేస్తున్నారని, ఆయా అభివృద్ది ద్వారా భూముల రేట్లు సైతం నాలుగు రెట్లు పెరిగిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ నిర్ధారణ, గుండె సంబంధిత క్యాత్ ల్యాబ్, స్టంట్ లు వేసే స్థాయికి ప్రభుత్వ వైద్యం ను తీసుకురావడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ వారి మాటలు నమ్మొద్దు అని, వారు చెప్పే మాటలు వినోద్దు అని అన్నారు. మన ప్రభుత్వం చేస్తున్న పథకాలు మనకు శ్రీరామ రక్ష అని అని అన్నారు.

కేసీఅర్ గారు నేడు రూ.2 వేల పెన్షన్ ఇస్తుంటే కాంగ్రెస్ రూ.4 వెలు ఇస్తుంది అని చెప్తున్నారు. ముందు మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయొచ్చుగా.. అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తదంట.. అలా ఉంది వేళ్ళు చెప్పేది అని అన్నారు.

రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ దండగ అన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే వ్యవసాయం చేయడమే దండగ అన్నట్టుగా ఉందన్నారు.

రైతులకు BRS ప్రభుత్వం నేడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. రైతులకు 3 గంటలు చాలు అని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. కేవలం మూడు విద్యుత్ ఇస్తే వ్యవసాయం చేయడం సాధ్యమా.. చెప్పాలన్నారు.

నియోజకవర్గంకు 1100 దళిత బందు వేస్తే మండలంకు 800 దళిత బందు ఇవ్వడం జరిగిందని, అత్యధిక సంఖ్యలో డబుల్ బెడ్ రూం ఇల్లు మండలంలో ఇచ్చినం అన్నారు.

ఖమ్మం నియోజకవర్గం ను దాటి ఇప్పటి వరకు మా నాన్న గారు కానీ, నేను కానీ పక్క చూపులు చూడలేదన్నారు.

ఇక్కడే ఉన్నాం. ఇక్కడే పని చేస్తున్నాం. కట్టె కాలే వరకు ఇక్కడే ఉంటాం. మీరు విజ్ఞతతో ఆలోచించి BRS ప్రభుత్వంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సిద్దిపేట, సిరిసిల్ల , గజ్వేల్ లో జరిగిన అభివృద్ది మన ఖమ్మం లో జరిగింది అని స్పష్టం చేశారు. మన ఖమ్మం లో జరిగిన అభివృద్ది ని చుసి ఇతర జిల్లాలు అనుసరించడం మనకు గర్వకారణం అన్నారు.

రానున్న రోజుల్లో ఇంటే అభివృద్ది చేస్తా.. ఇంతే కష్టపడతా.. మళ్ళీ నన్ను గెలిపించాలని, గెలిచినంక ఇంతకు రెండింతలు అభివృద్ది చేసి చూపిస్తా అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎంపిపి గౌరీ, వైస్ ఎంపిపి గుత్తా రవి, సర్పంచ్ లు మాదంశెట్టి హరిప్రసాద్, రామారావు, వైస్ సర్పంచ్ లు చెరుకూరి పూర్ణ, నున్నా వెంకటేశ్వర్లు, ఆత్మ చైర్మన్ లక్ష్మణ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మందడపు నర్సింహారావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, ఎంపిటిసి బలుసుపాటి సుజాత, నాయకులు కుర్రా భాస్కర్ రావు, నున్నా శ్రీనివాస్, చెరుకూరి బిక్షమయ్య, పిన్ని కోటేశ్వరరావు, మందడపు సుధాకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed