







Raghunadapalem/03.10.2023
తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ
ఖమ్మం నియోజవర్గం రఘునాథపాలెం మండలంలో పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో NREGS, SDF, SUDA నిధులు రూ.1.92కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
▪️బావోజీ తండా గ్రామంలో రూ.39.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
▪️రాముల తండా గ్రామంలో రూ.35.69 లక్షలతో హైమస్ట్ లైట్స్, గ్రామంలో నిర్మించిన 5-సీసీ రోడ్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
▪️గడ్డికుంట తండా, మల్లేపల్లి గ్రామంలో రూ.11.50 లక్షలతో చేపట్టిన
2-అభివృద్ధి పనులు, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
▪️పరికలబోడు తండా గ్రామంలో రూ.31.50 లక్షలతో చేపట్టిన 7 అభివృద్ధి పనులు, హై మాస్ట్ లైట్స్ ను ప్ర ప్రారంభించారు.
▪️జింకల తండా గ్రామంలో రూ.54.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్స్, డ్రెయిన్స్ ఇతర అభివృద్ది పనులు, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు.
▪️ రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన జింకల తండా గ్రామ పంచాయితీ కార్యాలయం ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
మొత్తం రూ.1.92కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
తోలుత బావోజి తండా గ్రామంలో BRS పార్టీ జెండా ను ఎగురవేశారు.
అనంతరం జింకల తండా లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని తండాలను విడగొట్టి గ్రామ పంచాయితీ లుగా మార్చి ఆ గ్రామాలకు మిమ్మలని సర్పంచ్ లుగా, వార్డ్ మెంబర్ లుగా చేసి మీ గ్రామాలను మీరే పాలించే విధంగా చేసినం.
గ్రామాల్లో BT రోడ్లు, అంతర్గత రోడ్లను సీసీ లుగా, డొంక రోడ్ల ను విస్తరించి మట్టి రోడ్లు గా మార్చినం.
గ్రామాల్లో చీకట్లు ఉండొద్దు అనే భావనతో ఆలోచించి మండలం మొత్తంలో 40 హై మాస్ట్ లైట్స్ ను ఎర్పాటు చేసినం.
గ్రామ పంచాయతీ పరిధిలో కేవలం 1.80 కోట్లు సీసీ రోడ్స్ కోసమే ఖర్చు చేసినం. జింకల తండా గ్రామంలోనే అన్ని అభివృద్ది పనులు కలిపి రూ.18.63 కోట్లు ఖర్చు చేసిన విషయం గుర్తు చేశారు.
ఇన్ని కోట్ల నిధులు ఎప్పుడూ.. ఏ ప్రభుత్వం ఇచ్చిందో గమనించాలి.
అసలు ఇన్ని నిధులు గతంలో ఎవరైనా తెచ్చారా.. ఆలోచన చేయాలి.
కేవలం మాటలు చెప్పి కాలం గడిపిన నాయకులు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు..
గిరిజనుల అభివృద్ధి కోసం కేసిఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.
తండాలను గ్రామ పంచాయితీలను చేసిన ఘనత కేసిఆర్ దే
మండలంలో అన్ని గ్రామాలను కలుపుతూ తండాల్లో లింక్ రోడ్లు, BT రోడ్లు వేసుకున్నాం.
గిరిజనుల అబివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ చెప్తున్నా మాయమాటలు, దొంగమాటలు నమ్మి మోసపోవద్దు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజనులకూ స్వర్ణ యుగం వచ్చింది.
70 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే కేవలం 9 సంవత్సరాల తెలంగాణ పరిపాలన ఒక ఎత్తు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ ను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజనులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి 188 గిరిజన గురుకులాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. రఘునాథ పాలెం మండల కేంద్రంలో గిరిజనుల కోసం స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఎర్పాటు చేశాం.
గత పాలనాల్లో గిరిజనులకు కనీస వసతులు కల్పించిన దాఖలాలు లేవు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.
నీళ్ల కొరకు మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఇపుడు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా త్రాగునీరు అందిస్తున్నాం.
కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వాలని ఏం మొఖం పెట్టుకొని అడుగుతున్నారో అర్దం కాట్లే.
65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలి.
కాంగ్రెస్ ఆశలన్నీ అడియాశలే
మళ్లీ కాంగ్రెస్ కు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వరు.
తెలంగాణలో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 700 మాత్రమే ఇస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఎలా చేస్తారు .
కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యట్రిక్ సాధించడం ఖాయం.
ఇప్పుడు వస్తున్న పథకాలు అన్ని మనకు యధావిధిగా రావాలంటే ప్రజలు మన BRS ప్రభుత్వంను మళ్లీ గెలిపించుకోవాలని కోరుతున్నా.
