తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఖమ్మం, అక్టోబర్ 3: నగరంలోని 8వ డివిజన్ వైఎస్సార్ నగర్ లో రూ. 580.80 లక్షలతో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే ప్రభుత్వ సంకల్పమ‌ని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ట్టించి, పేద‌ల‌కు పంపిణీ చేస్తున్న‌ద‌ని అన్నారు. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ‌త ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా ఏదో ఓ ఇంటికి ఇంత డ‌బ్బు, మెటీరియ‌ల్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ప్ర‌భుత్వం పేద‌ల ఆత్మ‌గౌర‌వం పెంచే విధంగా ప్రభుత్వ స్థలంలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేసి అందిస్తున్నదని అన్నారు. పూర్తి పారదర్శకంగా అర్హులైన ల‌బ్ధ‌దారులను ఎంపిక చేసి వారికి ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసుకున్నామని, కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. వైఎస్సార్ నగర్ లోని పిల్లలకు స్కూల్ దగ్గర్లో లేనిది గుర్తించి, ఇందులోనే నూతన ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఏర్పాటుచేసి ప్రారంభించు కున్నామన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత నిచ్చి, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా విద్యాధికారి ఏ. సోమశేఖర శర్మ, ఆర్ అండ్ బి ఇఇ శ్యాం ప్రసాద్, ఖమ్మం అర్బన్ మండల విద్యాధికారి శ్రీనివాస రావు, సిఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవి, రామకృష్ణ, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సిహెచ్. స్వామి, కార్పొరేటర్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————-జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు