Khammam/03.10.2023

VNBTV news ఖమ్మం సిటీ

ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.48కోట్లతో పలు అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు చేశారు.

రూ.1.85 కోట్లతో శంకుస్థాపనలు, రూ.63.99 లక్షలతో అభివృద్ది పనుల ప్రారంభోత్సవం చేశారు.

▪️4వ డివిజన్ రాజీవ్ నగర్ నందు LRS నిధులు రూ.15లక్షలతో నిర్మించనున్న CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

▪️34వ డివిజన్ రంగనాయకుల గుట్ట వద్ద మున్సిపల్ సాధారణ నిధులు రూ.63.99లక్షలతో నిర్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్ కిట్స్, టీ షర్ట్స్ లను పంపిణీ చేశారు.

▪️30వ డివిజన్ సుందరయ్య నగర్ నందు LRS నిధులు రూ.30 లక్షల నిర్మించనున్న CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. SDF నిధులు రూ.90లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

▪️51, 52వ డివిజన్ సరిత క్లినిక్ సెంటర్ నందు LRS నిధులు రూ.50లక్షలతో నిర్మించనున్న CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో ఇప్పటికే అన్ని రోడ్లు, కాల్వలు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న అరకొర పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు.

BRS ప్రభుత్వం తప్ప ఉన్ని వేల కోట్ల నిధులు ఎవ్వరూ తెలేరు అని, ఇచ్చే ప్రభుత్వం కూడా రాదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారు విజన్ ఉన్న నాయకులు కాబట్టే నేను అడిగినన్ని నిధులు తీసుకురాగలిగినం అని చెప్పారు.

ఖమ్మం లో మళ్ళీ BRS ప్రభుత్వాన్ని మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్, అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు దండా జ్యోతి రెడ్డి, ముక్కాల కమల, బుర్రి వెంకట్ కుమార్, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, పసుమర్తి రాం మోహన్, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, మాటేటి నాగేశ్వరరావు, ముక్కాల రాజేష్, బుర్రి వినయ్ కుమార్, కన్నం ప్రసన్న కృష్ణ, శ్రీను నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed