యాదవ కురుమల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించాలి.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం.

జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు , డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఖమ్మం జిల్లా యాదవ కురుమల సమస్యలను పరిష్కరించడానికి మరియు అభివృద్ధి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు , డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యాదవ కురుమ సంఘం నాయకులు గొర్రెల పెంపకం దారుల సంఘాల అధ్యక్షులు , సభ్యులతో కలిసి యాదవ కురుమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు . తదనంతరం ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి ఈ సమాజంలో నమ్మకానికి మారు పేరైన మాట ఇస్తే మాట తప్పని కురుమ యాదవుల సమస్యల పరిష్కారానికి తప్పగా ప్రయత్నిస్తానని , పార్టీ అధిష్టానంతో మాట్లాడి మేనిఫెస్టోలో ప్రకటింప చేస్తానని హామీ ఇచ్చారని మల్లి బాబు యాదవ్ తెలిపారు . 1993లో యాదవులను కురుమలను గొర్రెల సొసైటీలుగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డినేతృత్వంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసింది . కాంగ్రెస్ ప్రభుత్వ మేనని 2017 జూన్ 20న యాదవ కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టిందని , 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తిస్తుందని మొదట చెప్పడం జరిగిందని , ఈ రాష్ట్రంలో దాదాపు 80లక్షల మంది ఉన్న యాదవ జనాభా కు కేవలం 709,000 మందిని అర్హులుగా ప్రకటించారని , డ్రా ద్వారా ఏ లిస్టు , బి లిస్టులుగా విభజించి , ఇంకా బి లిస్టులోని 3,54,791 మందికి గొర్రెల పంపిణీ చేయాల్సి ఉన్నది . ఖమ్మం జిల్లాలో ఇంకా 16,353 మందికి పంపిణీ చేయాల్సింది ఉండగా ఇప్పటివరకు దాదాపు 15 నెలలు కాలంలో 11,000 మంది 43,750 రూపాయలు చొప్పున డీడీలు తీసి ఉన్నారు . కానీ కేవలం 780 మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు . యాదవ కురుమలను మోసం చేయడానికి కమీషన్లకు కక్కుర్తి పడి అండదండతో అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని మల్లిబాబు యాదవ్ తెలిపారు . ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టి , కట్టిన లబ్ధిదారులకు వాటాదనం తిరిగి డబ్బులు వాపసు ఇవ్వాలని , వాటాదనం లేకుండా దళిత బంధు బీసీ బందు మాదిరిగా గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని , నగర పట్టణ ప్రాంత యాదవ కురుమలకు ఈ పథకం వర్తింపజేయాలని పై విషయాలను మేనిఫెస్టోలో ప్రకటించాలని కోరారు . ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ నాగ సీతారాములు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య , జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి గూదే భద్రయ్య , జోనబోయిన పాపయ్య , గొర్రెల సంఘం అధ్యక్షులు సోమనబోయిన లింగయ్య , బట్ట కోటయ్య లోడిగ వెంకటనారాయణ , చింతల ఎల్లిబాబు , మంద నాగేశ్వరరావు , ముతే , బోయిన రామ్మూర్తి , చెన్ను వెంకటయ్య , పొదిల నరేష్ , కాసు మల్లేష్ , తుప్పతి రవికుమార్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed