Khammam/06.11.2023

తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ

ఈ మార్కెట్ నా శ్వాసలో ఉంది.. నా గుండెల్లో ఉంది..

నా శ్వాసలో ఈ మార్కెట్ ఉంది.. నా గుండెల్లో ఈ మార్కెట్ ఉంది.. నా గుండెల్లో ఈ మార్కెట్ ఉంది అని ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

సోమవారం ఖమ్మం నగరం త్రీ టౌన్ లోని గ్రైన్ మార్కెట్ నందు ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు, కార్మికులు, వ్యాపారులను కలిసి BRS పార్టీ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం వారు మాట్లాడారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఇక్కడే ఉంటుంది అని, కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక మహనుభావుడు ఇక్కడ నుండి మార్కెట్ మద్దులపల్లి ను తరలించాలి తీవ్ర ప్రయత్నం చేసిన దరిమిలా దన్ని అడ్డుకట్ట వేసిన అన్నారు.

కానీ నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడి నుండి మార్కెట్ తరలి వెళ్ళడం స్పష్టం చేశారు.

ఈ మార్కెట్ నా గుండెకాయ లాంటిదని తనలో నుండి వేరు చేయడం కష్టం అన్నారు.

నేను ఈ మార్కెట్ ఎప్పుడూ ఇక్కడే ఉంటామని, ఎక్కడికి పోము అని అన్నారు. నేను ఇక్కడే చదువుకున్న, ఇక్కడే పెరిగిన మీ మధ్యనే తిరిగిన నన్ను ఆదరించాలని కోరారు.

నాపై నమ్మకంతో రెండు పర్యాయాలు నన్ను గెలిపించారు.. ఈ సారి కూడా అదే ప్రేమ చూపించాలని కోరారు.

కార్యక్రమంలో భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శి చిన్నికృష్ణా రావు, మెంతుల శ్రీశైలం, Gy నరేష్, మన్నెం కృష్ణ, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, వేములపల్లి వెంకన్న, ఉప్పల రావు, కార్పొరేటర్ పసుమర్తి రాం మోహన్, నున్నా మాధవరావు, దేవత అనిల్, వెంపటి నాయుడు ఏడ్లపల్లి సతీష్, మాటేటి నాగేశ్వర రావు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed