కాంగ్రెస్ కు బిగ్ షాక్..!

  • మాజీ మంత్రి సంభాని సహా బీఆర్ఎస్ లో చేరిన పలువురు ప్రముఖులు
  • సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్న నేతలు

నవంబర్, 10:

మాజీ మంత్రి, టీపీసీసీ ముఖ్య నేత సంభాని చంద్రశేఖర్ సహా ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎడవల్లి కృష్ణ, కోటూరి మానవతారాయ్, డాక్టర్ రాంచందర్ నాయక్, మడత వెంకట్ గౌడ్ లకు కేసీఆర్ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దగ్గరుండి మరీ నేతలందరినీ పార్టీలో చేర్పించారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమే తామంతా పార్టీ లో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. పార్టీలో చేరిన నాయకులందరి సేవలు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు సూచించారు. అంతకు ముందు వీరందరి నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతిభవన్ కు పిలిపించుకుని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు వచ్చిన ముఖ్య అనుచరులకు కేటీఆర్ స్వయంగా గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి స్వాగతించారు. పార్టీ
లో చేరిన నేతలందరికీ ఎంపీ రవిచంద్ర స్వాగతం పలుకుతూ.. కృతజ్ఞతలు తెలిపారు. వీరి చేరికకు బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేతలంతా సమిష్టిగా కృషి చేసామని రవిచంద్ర ప్రకటించారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియా నాయక్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు