











*తెలంగాణ ప్రచారంలో సరికొత్తగా ముందుకు సాగిన ప్రియాంక గాంధీ
ఆదివాసుల, గిరిజనులు, దళితులు, వికలాంగులతో, మైనారిటీ పాపతో చిన్న ఇందిరమ్మ
ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో అత్యంత సామాన్యులతో కలిసి ముందుకు సాగిన ప్రియాంక గాంధీ
వేదికపైకి దళిత వికాలంగా వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడిన వైనం
ఆదివాసీ, గిరిజనులను, దళిత, మైనారిటీ పాపని దగ్గరకు తీసుకుని.. వారి కష్టసుఖాలు తెలుసుకున్న ప్రియాంక గాంధి.
శ్రీమతి ప్రియాంక గాంధీతో పాటు ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిఎల్పీ నేత మధిర శాసనసభ అభ్యర్థి భట్టి విక్రమార్క, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కాంగ్రెస్స్ అధ్యక్షుడు పువ్వళ్ళ దుర్గాప్రసాద్ , ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తదితరులు.
ఈ రోజు ఖమ్మం ఖమ్మం జిల్లాలో కొనసాగిన శ్రీమతి ప్రియాంక గాంధీ రోడ్ షో కాంగ్రెస్ శ్రేణులకు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చిదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కల్లూరు, పాలేరు ఖమ్మంలో జరిగిన రోడ్ షోలో శ్రీమతి ప్రియాంక గాంధీ సరికొత్త విధానంలో ముందుకు దూసుకెళ్లారు. ప్రియాంక గాంధీ రోడ్ షో ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి దశ దిశను చూపింది. ప్రియాంక గాంధీ రోడ్ షో చూసిన వారికి ఎవరికైనా ఆమెలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ తప్పకుండా కనిపించే ఉంటుంది. ఇందిరా గాంధీ తరహాలోనే ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటన కొనసాగింది. స్వర్గీయ ఇందిరాగాంధీ తరహాలోనే దళిత, గిరిజన, ఆదివాసి, ముస్లిం, సహా అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని వారితో మమేకం అవుతూ ముందుకు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సకల జనులు సకల ప్రజల సమ్మేళనం.. సర్వ కులమతాల కలయిక అని చేతల్లో చూపించింది. ఖమ్మం జిల్లా వేదిక కావడం గమనార్హం. చిన్న ఇందిరమ్మ పర్యటనలతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఉరకలెత్తాయి. కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జవసత్వాలు కల్పించే లాగా ప్రియాంక గాంధీ పర్యటనలో గిరిజన నృత్యాలు ఆదివాసీలతో స్టెప్పులు, మైనారిటీ పాపని ముద్దాడి అలరించుకుంటు కొనసాగిందని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.
