…తుమ్మల నాగేశ్వర్ రావు…వ్యవసాయ శాఖ మంత్రి.సహజంగా రాజకీయాల్లో ఉన్నవారు పదవుల్లో ఉన్నా లేకున్నా వారి సొంత వ్యాపారాలో లేదా కాంట్రాక్టులో లేదంటే కుటంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.కానీ మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యవసాయం పట్ల తపన ఉన్న అతికొద్ది మంది నేతల్లో తుమ్మల తనదైన ముద్ర వేసారు.ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నాడే సత్తుపల్లి అశ్వరావుపేట ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో వాణిజ్య పరంగా ఎంతో డిమాండ్ ఉన్న పామాయిల్ సాగు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని భావించి మొదట తన వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ సాగు మొదలు పెట్టి మిగతా రైతులకు ఆదర్శంగా మారడంతో నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు ఉందంటే విజనరీ లీడర్ గా తుమ్మల తనదైన ముద్ర వేసారని రైతులు గర్వంగా చెబుతున్నారు.
……రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్న పామాయిల్ సాగు.
పామాయిల్ తోటల్లో అంతర పంటల సాగుపై తుమ్మల ప్రత్యేక శ్రద్ద
…..పామాయిల్ మొక్క నాటితే 40 ఏండ్ల పాటు ఫలసాయం ఇస్తుంది.తక్కువ పెట్టుబడితో నష్టాలు లేకుండా దీర్ఘకాలిక లాభాలతో పామాయిల్ వాణిజ్యపరంగా ఎంతో డిమాండ్ ఉండటంతో రైతులకు నష్టమనేది రాదు.పామాయిల్ తోటల్లో అదనపు లాభాల కోసం అంతరపంటగా కోకో సాగు చేస్తున్నారు.దాంతో వేలాది రూపాయాలు రైతులకు అదనపు లాభాలు గడిస్తున్నారు.పామాయిల్ తోటల్లో కోకో తో పాటు కొత్తగా ఏ వాణిజ్య పంటల సాగు చేస్తే బాగుంటందనే అంశాలపై మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ద పెట్టారు.హార్టీకల్చర్ డిపార్ట్ మెంట్ వారితో మాట్లాడి నిపుణులైన శాస్త్రవేత్తలను పిలిపించి పామాయిల్ తోటల్లో పర్యటించి శాస్త్రవేత్తలతో అంతర పంటల సాగు పై వివరంగా చర్చించారు మంత్రి తుమ్మల.కోకో తో పాటు కొత్తగా జాజికాయ సాగు అంతర పంటగా సాగు రైతులకు లాభంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తుమ్మలకు వివరించారు. కేరళ కే పరిమితమైన జాజికాయ సాగుకు దమ్మపేట… అశ్వారావుపేట…సత్తుపల్లి ప్రాంతాల్లో అనుకూల వాతావరణం ఉండటం తో మిగతా రైతాంగానికి మార్గదర్శిగా ఉండాలని మొదట తన వ్యవసాయ క్షేత్రంలో జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టారు తుమ్మల.
…. జాజికాయ సాగుకు కేరళ కేరాఫ్ గా మారింది.అక్కడ కొబ్బరి తోటల్లో అంతర పంట గా జాజికాయ సాగు చేస్తోన్నారు .దేశ వ్యాప్తంగా దాదాపు 85 శాతం జాజికాయ దిగుబడి కేరళ నుంచే వస్తోంది. కేరళ తరువాత తమిళనాడు కర్ణాటక లో జాజికాయ సాగు చేస్తోన్నారు. తెలంగాణ లో తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాజికాయ సాగుకు బాటలు చేశారు.తన వ్యవసాయ క్షేత్రంలో గత ఏడాది జాజికాయ మొక్కల్ని కేరళ నుంచి తెప్పించి నాటారు.ఒక్కో మొక్క 1200 రూపాయలకు కొనుగోలు చేశారు.ఎకరం పొలంలో 50 నుంచి 70 మొక్కలు నాటే అవకాశం ఉంది.నాటిన నుంచి ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలకు దిగుబడి వస్తుంది.ఒక్కో మొక్క 70 అడుగుల వరకు పెరుగుతోంది.
మొక్క దిగుబడి అరవై యేండ్ల కు పైగా ఉంటోంది.జాజికాయ ఆయుర్వేద మందులు ఫార్మా కాస్మెటిక్స్ రంగాల్లో బాగా డిమాండ్ ఉంది.కింటా ప్రస్తుత మార్కెట్ రేట్ 30 వేల వరకు ఉంది.పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగు వల్ల ఓ పక్క పామాయిల్ రాబడులతో పాటు అదనపు ఆదాయం జాజికాయ సాగు వల్ల వస్తోంది.ఎక్కడో కేరళ లో సాగులో ఉన్న జాజికాయ పంట సాగుకు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటం తో సాగుకు శ్రీకారం చుట్టిన తుమ్మల.. మా ప్రాంత రైతాంగానికి మార్గదర్శిగా నిలిచారనీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు
…..రైతు ను రాజుగా మార్చడమే నా సంకల్పం.. మంత్రి తుమ్మల.
….పామాయిల్ తోటల్లో అంతరపంటల సాగు గా ఇప్పటికే ఉన్న కోకో తో పాటు కొత్తగా మిరియాలు జాజికాయ సాగు కోసం తోటల పరిశీలనకు శాస్త్రవేత్తల బ్రుందం ను పిలిపించి వారితో తోటల పరిశీలన చేసామని,అంతర పంటల సాగుతో పామాయిల్ రైతులకు అదనపు లాభాలు వస్తాయని కేరళ రైతులు మాదిరి స్పైసెస్ పంటలు సాగు చేసేలా ప్రణాళిక సిద్దం చేశామని
అంతర పంటల సాగు వల్ల దాంతో వచ్చే లాభాలతో రైతులు సంతోషంగా ఉంటారని మిగతా రైతులకు భరోసా ఉండేలా మొదట తన వ్యవసాయ క్షేత్రంలో జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
*నాడు పామాయిల్ సాగుకు ప్రాణం పోసి రైతును రాజుగా మార్చగా నేడు జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టి రైతాంగానికి మార్గదర్శిగా తుమ్మల నిలిచారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

