డిసిసిబి బ్యాంక్ క్యాలెండర్లు విడుదల చేసిన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తమ ఖాతాదారులకు, రైతులకు, ప్రతి సంవత్సరం అందించే క్యాలెండర్లను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బో బోలు లక్ష్మణరావు ఈరోజు ఆవిష్కరించి విడుదల చేశారు , ఈ సందర్భంగా కల్లూరు బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ కల్లూరు మండల సెంట్రల్ బ్యాంక్ పరిధిలో ఉన్న రైతులు రైతులకు అందించే కర్ష క మిత్ర పథకం ద్వారా సుమారు రెండు ఎకరాలు ఉన్న రైతులకు నాలుగు లక్షల నుండి అత్యధికంగా 10 లక్షల వరకు రుణాలు ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా గోల్డ్ లోను గ్రాము కు 4400 రూపాయలు అతి తక్కువ వడ్డీకి ఇవ్వటం జరుగుతుందని, సహకార లక్ష్మీ పథకం కింద డిపాజిట్ లపై అత్యధిక వడ్డీని 465 రోజులకు గాను 7.6 శాతం వడ్డీ, సీనియర్ సిటిజనులకు అదనంగా 0.5 వడ్డీని తమ బ్యాంకు ద్వారా ఇస్తున్నట్లు దీనిని వినియోగదారులు ఖాతాదారులు,రైతులు వినియోగించుకోవాలని మేనేజర్ కోరారు, నూతన సంవత్సర సందర్భంగా కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకు న్నారు ఈ కార్యక్రమంలో కల్లూరు బ్రాంచ్ మేనేజర్ నాగళ్ళ రాణి,అసిస్టెంట్ మేనేజర్ సత్తి పుష్ప, సూపర్వైజర్ షేక్ జానీ మియా, బ్యాంకు సిబ్బంది షేక్ ఖాలిద్, భాస్కర్, రైతులు పసుమర్తి మోహన్ రావు , మాదాల వెంకటేశ్వరరావు, షేక్ కమ్లి , దార్ల నరసింహారావు,ఉప్పు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

ByVNB News

Jan 2, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed