బాధను దిగమింగి…. ధైర్యం చెప్పా…!

– నాతో పాటు నన్ను నమ్ముకున్న వారందరినీ గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది

– ఇందిరమ్మ రాజ్యంలో నిరుద్యోగ యువతకు భవిష్యత్తు

– రైట్ చాయిస్ ఆత్మీయ అభినందన సభలో మంత్రి శ్రీనివాసరెడ్డి

– ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురైన పొంగులేటి

– పొంగులేటి రాజకీయ ప్రస్థానం పై లఘు చిత్ర ప్రదర్శన

– రూపకర్త మెండం కిరణ్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు

ఖమ్మం : గత ఏడాది ఇదే సమయంలో గత ప్రభుత్వం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళను అనేక ఇబ్బందులకు, అవమానాలకు గురిచేసింది… ఆ సమయంలో నా అనుచరులందరికి నన్ను కలిసిన సమయంలో బాధను దిగమింగి….వారికి ధైర్యం చెప్పా… నా బాధను కూడా వ్యక్త పరిస్తే ఎక్కడ నా వాళ్ళు ఇబ్బంది పడతారోననే ఉద్దేశ్యంతో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నానంటు…. గతాన్ని గుర్తుచేసుకుని రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన వేడుక సభలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని..నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. మా ప్రభుత్వం ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని.. టీ ఎస్ పి ఎస్ సి ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి నాయ్యం జరుగుతుందని హామీ ఇచ్చారు.

– పొంగులేటి రాజకీయ ప్రస్థానం పై లఘు చిత్ర ప్రదర్శన

రాజకీయాల్లోకి వచ్చింది మొదలు… మంత్రి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానాన్ని లఘుచిత్రం రూపంలో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ రూపకర్త రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ను పొంగులేటితో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన నిరుద్యోగుల సదస్సు నుంచే బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను గళం వినిపించిన విషయాన్ని పొంగులేటి గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు