సూక్ష్మంగా 6 గ్యారంటీలు ఇచ్చిన స్థూలంగా 13 గ్యారెంటీలను అమలుపరిచిన కాంగ్రెస్

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సంజీవరెడ్డి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్ది మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సూక్ష్మంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పటికీ స్థూలంగా 13 గ్యారంటీలు ఇచ్చిందని, వాటిలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కి పది లక్షలు వర్తింపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ , ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 చొప్పున గృహాలు మంజూరు కార్యక్రమాల అమలు చేసిందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం అంటే, దాదాపు 66 లక్షల మంది రైతులకు 6,319 కోట్ల రూపాయలు రైతు భరోసా సహాయం అందిందని , మిగతా వారికి ఈ నెల 13 తర్వాత తప్పనిసరిగా జమ అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు , టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో, ఏక మొత్తంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అవుతుందని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జన గణన చేసి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తుందని అన్నారు . ఇక టిఆర్ఎస్ పార్టి బిఆర్ఎస్ అయిందని, బిఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ లోపించిందని, కెసిఆర్ తన బిడ్డని బిర్లా, అల్లుడ్ని అంబానీ, కొడుకుని టాటా చేశాడని తెలంగాణ సంపదనంతా దోసి కెసిఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిందని, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని వంద సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ, పచ్చీసు గ్యారెంటీ పేరుతో ప్రజల ముందుకు వచ్చిందని కచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తుందని, దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు . అదేవిధంగా కేంద్రం సిబిఐ ఈడీ , ఐటి లను ప్రయోగించిందని ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పోలీసుల్ని తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసుకు పంపి అరెస్టుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ లో భయపడేవారు ఎవరు లేరని తెలియజేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం భేటీ బచావో పేరుతో మణిపూర్, ఉన్నావ్, ఆత్రాస్ లలో ఆడబిడ్డల మాన ప్రాణాలు బలి తీసుకున్నారని, దేశంలో మోడీ ప్రభుత్వం 123 లక్షల కోట్ల రూపాయల అప్పుచేసి దేశాన్ని లూటీ చేసిందని, బీజేపీ పార్టీ అధికారంలోకి రాగనే జన్ ధన్ ఖాతాలో ధన ధన 15 లక్షల రూపాయలు పడతాయని అన్నాడని అలాంటిది ఇప్పుడు ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు