డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.
హైదరాబాద్ నవంబర్ 2 మన జ్యోతి డెస్క్
కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే వారు వెంటనే స్పందించారు. ఆ విద్యార్థిని కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

సాయిశ్రద్ధ తల్లిదండ్రులతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవగా, వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు