విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి..

వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి..

వసతి గృహాల తనిఖీ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్. ప్రియాంక అల ఐఏఎస్* .

వస్తి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల కార్యదర్శి, మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారుల సోషల్, మైనారిటీ, బీసీ మరియు గిరిజన సంక్షేమ హాస్టల్లో రాత్రి తనిఖీ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో బొల్లోరి గూడెం లో ఉన్నటువంటి టీజీ ఎంఆర్ఎఫ్ వసతి గృహం మరియు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల ను తనిఖీ చేశారు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వసతి గృహాల గదులను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన బియ్యం ఆహార పరిశీలించారు. కిచెన్ షెడ్ లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారిని పరిశీలించి వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఆమె సిబ్బంది యొక్క హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు.

సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసినట్లైతే తహశీల్దాం కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థిని, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ప్రతిరోజూ ఉపాధ్యాయులు వంతుల వారీగా ఆహార పదార్థాల నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలని ఆదేశించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో నీటి వసతి, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలలో మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు,, పాల్వంచ ఎంఆర్ఓ వివేక్ మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు